హైద‌రాబాద్ రైజ‌ర్స్ కు షాక్ కేకేఆర్ సూప‌ర్ విక్ట‌రీ

7 వికెట్ల తేడాతో అద్భుత విజ‌యం న‌మోదు

హైద‌రాబాద్ : ఐపీఎల్ 2026లో వరుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కోలుకోలేని రీతిలో ఝ‌ల‌క్ ఇచ్చింది కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్. ఏకంగా 7 వికెట్ల తేడాతో ఓడించింది. స్వంత గ‌డ్డ‌పై బిగ్ షాక్ ఇచ్చింది. కోల్ క‌తా బౌల‌ర్ల మాయాజాలానికి బ్యాట‌ర్లు చేతులెత్తేశారు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 36 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు తీస్తే సునీల్ న‌రైన్ 311 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్ 19 ఓవ‌ర్ల‌లో 165 ప‌రుగులు చేసింది. ఆట‌గాళ్లు అంతా బౌలింగ్ దెబ్బ‌కు పెవిలియ‌న్ బాట ప‌ట్టారు.

ఓప‌న‌ర్లు ట్రావిస్ హెడ్ 28 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 3 సిక్స‌ర్లతో 61 ర‌న్స్ చేయ‌గా ఇషాన్ కిష‌న్ 29 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్ర్ల‌తో 42 ర‌న్స్ చేసిన‌ప్ప‌టికీ మిగ‌తా బ్యాట‌ర్లు ఆశించిన మేర రాణించ‌లేక పోయారు. అనంత‌రం స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని అవ‌లీల‌గా ఆడుతూ పాడుతూ ఛేదించింది. కేవ‌లం 18.2 ఓవ‌ర్ల‌లోనే ప‌ని పూర్తి చేసింది. మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయింది. యువ క్రికెట‌ర్ ర‌ఘ వంశీ 47 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 59 ర‌న్స్ చేయ‌గా , కెప్ట‌న్ ర‌హానే 36 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్ తో 43 ర‌న్స్ చేశాడు. ఈ టోర్నీలో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు ఇది మూడో విజ‌యం . వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తికి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ పుర‌స్కారం ద‌క్కింది. ఇదిలా ఉండ‌గా శ్రేయాస్ సార‌థ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ తో బుధ‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా హైద‌రాబాద్ జ‌ట్టు ఆడ‌నుంది.

Leave A Reply

Your Email Id will not be published!