UPSC Result 2021 : సివిల్ సర్వీసెస్ టాపర్ గా శ్రుతి శర్మ
2021 ఫలితాలు వెల్లడించిన యూపీఎస్సీ
UPSC Result 2021 : దేశ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2021 సంవత్సరానికి గాను సివిల్స్ ఫలితాలను ప్రకటించింది(UPSC Result 2021).
విచిత్రం ఏమిటంటే ఈసారి దేశ వ్యాప్తంగా ర్యాంకులలో వరుసగా మూడు టాప్ ర్యాంకులలో మహిళలే సాధించడం విశేషం. 1, 2, 3 ర్యాంకులను వారే పొందడం వారి నిబద్దతకు, అంకిత భావానికి దక్కిన గౌరవంగా భావించక తప్పదు.
ఈ సివిల్స్ ఎగ్జామ్స్ అంతిమ ఫలితాలలో శ్రుతి శర్మ అగ్ర స్థానంలో నిలిచారు. అంకితా అగర్వాల్ రెండో స్థానంలో ఉండగా గామిని సింగ్లా మూడో ర్యాంకులను పొందారు. ఈ విషయాన్ని యూపీఎస్సీ సోమవారం అధికారికంగా ప్రకటించింది.
685 మంది అభ్యర్థులు ప్రతిష్టాత్మకమైన పరీక్షకు అర్హత సాధించారు. ఉత్తీర్ణులైన(UPSC Result 2021) అభ్యర్థుల్లో 244 మంది జనరల్ (సాధరణ) కేటగిరీకి చెందిన వారు ఉన్నారు.
73 మంది ఆర్థికంగా వెనుకబడిన (ఓబీసీ) వర్గాల వారు, 203 మంది ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన వారున్నారు. ఇక 105 మంది షెడ్యూల్డు కులాలు (ఎస్సీ) , 60 మంది షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ)లకు చెందిన వారు ఎంపికైనట్లు కమిషన్ తెలిపింది.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్ ) , ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్ ) , ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) , ఇతర అధికారులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ప్రతి ఏటా సివిల్ సర్వీసెస్ పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తుంది.
ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూలు చేపడుతుంది. ఈ ఏడాది జనవరిలో పరీక్ష పూర్తయింది. ఏప్రిల్, మే నెలల్లో ఇంటర్వ్యూలు చేపట్టారు. ఒక అభ్యర్థి రిజల్ట్ నిలిపి వేసింది కమిషన్.
Also Read : ఆ యూనివర్శిటీకి గుర్తింపు లేదు – యూజీసీ