Siddaramaiah Modi : ఇంకేం ఉంది దోచుకునేందుకు
మోదీపై సిద్దరామయ్య ఫైర్
Siddaramaiah Modi : ఇప్పటికే దేశాన్ని దోచుకునే వాళ్లకు కట్టబెట్టారు. అన్నింటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు. చివరకు పాలను సైతం అమ్మకుండా చేసేందుకు కుట్ర పన్నారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు, మాజీ సీఎం సిద్దరామయ్య. ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు పీఎంకు సూటిగా ప్రశ్నలు సంధించారు.
ఇంకెంత కాలం దోచుకుంటారంటూ నిలదీశారు. ఇప్పటికే కర్ణాటకకు వచ్చినప్పుడల్లా హామీలు ఇస్తున్నారు. కానీ తమను మోసం చేస్తున్నట్లు ప్రజలు తెలుసుకోలేక పోతున్నారంటూ వాపోయారు. కర్ణాటకకు రావడమా లేక కర్ణాటక నుంచి దోచుకోవడమా అని ప్రశ్నించారు సిద్దరామయ్య(Siddaramaiah Modi) .
మీరు ఇప్పటికే కన్నడిగుల నుండి బ్యాంకులు, ఓడ రేవులు, విమానాశ్రయాలను దొంగించారని , ఇప్పుడు తమ నుండి నందిని (కేఎంఎఫ్)ని దొంగిలించేందుకు ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోందని మండిపడ్డారు సిద్దరామయ్య. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు సర్కార్ అడ్డాగా మారిందని ఆరోపించారు.
ప్రజలు మార్పును కోరుతున్నారని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టడం ఖాయమన్నారు. కేఎంసీని దెబ్బ కొట్టేందుకు గుజరాత్ కు చెందిన అముల్ ను తెస్తున్నారంటూ కామెంట్ చేశారు.
Also Read : బొమ్మన్ ..బెల్లీని కలిసిన మోదీ