Sihmachalam : నృసింహ మండల దీక్షలు ప్రారంభం
అప్పన్న ఆలయం భక్త జన సందోహం
Sihmachalam : సింహాచలం – శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవాలయంలో నృసింహ ( చందన ) దీక్షలు సంప్రదాయంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలు మూలల నుండి వందలాదిగా తరలి వచ్చారు. భక్తులు చందన దీక్షలను స్వీకరించారు.
అప్పన్న ఆలయ వైదిక పెద్దలు తులసి మాలలను భక్తుల మెడలో వేసి దీక్షలకు శ్రీకారం చట్టారు. ముందుగా తులసి మాలలు, దీక్షా వస్త్రాలు మూల విరాట్ సన్నిధిలో ఉంచి పూజలు చేశారు. వైదికులు, అధికారులు, భక్తులు వెంట రాగా.. బేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రత్యేక వేదిక పైకి తీసుకు వచ్చారు.
Sihmachalam Pooja
వేదిక పై ఏర్పాటు చేసిన స్వామి వారి నమూనా విగ్రహం వద్ద సంప్రదాయ పూజలు చేశారు. ఉప ప్రధానార్చకులు సీతారామాచార్యులు సింహాచలేశుని అష్టోత్తర శత నామావళిని భక్తులతో పారాయణ చేయించారు.
ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వేతో ముఖం..నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యుమ్ నామామ్యాహమ్ అంటూ ప్రధానార్చకుడు శ్రీనివాసాచార్యులు స్తోత్రం చేయగా భక్తులంతా నారసింహ మంత్ర జపం చేశారు.
వైదికులు ఒక్కొక్కరికి మాలధారణ చేశారు. దీక్షల పరమార్ధాన్ని స్థానాచార్యులు డాక్టర్ టి పి.రాజగోపాల్ వివరించారు. దీక్షలు తీసుకున్న భక్తులకు స్వామివారి ప్రతిమ, వస్త్రాలు అందజేసారు. దీక్షాపరులందరికీ స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.
40 రోజుల పాటు మండల దీక్షగా భక్తులు ఆచరిస్తారు. దీక్ష తీసుకున్న భక్తులకు దేవస్థానం ప్రత్యేకమైన సదుపాయాలు కల్పిస్తుందని అధికారులు వెల్లడించారు. రెండో దశ 32 రోజుల దీక్షలు డిసెంబర్ 4 వ తేదీన ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించారు.
జనవరి 6 వ తేదీన దీక్షల విరమణ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఆ రోజు స్వాతీ నక్షత్రం పర్వదినం కూడా కావడంతో నృసింహ హోమం ఆర్జిత సేవగా నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
Also Read : Revanth Reddy : అరాచక శక్తుల ఆటలు సాగవు