Simranjit Singh Mann : సంగ్రూర్ ఉప ఎన్నికల్లో ఆప్ కు షాక్
శిరోమణి అకాళీదల్ అభ్యర్థి సిమ్రంజిత్ మాన్ విక్టరీ
Simranjit Singh Mann : ఇటీవల పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది.
సంగ్రూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రస్తుత పంజాబ్ సీఎంగా ఉన్న భగవంత్ మాన్ ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి అసెంబ్లీలో గెలుపొందారు.
ప్రస్తుతం సీఎంగా కొలువు తీరారు. ఆయన రాజీనామా చేయడంతో ఖాళీ అయ్యంది సంగ్రూర్ లోక్ సభ స్థానం. తాజాగా ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది.
భగవంత్ మాన్ కు పట్టు కలిగిన ఈ స్థానం కోల్పోవడం ఆప్ కు షాక్ గురి చేసింది. శిరోమణి అకాలీదళ్ (అమృత్ సర్ ) పార్టీకి చెందిన సిమ్రంజిత్ సింగ్ మాన్ (Simranjit Singh Mann) ఇక్కడ 7,000 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
తన సమీప ఆప్ అభ్యర్థి గుర్ మైల్ సింగ్ పై గెలుపొందారు. ఇక్కడ సీఎం భగవంత్ మాన్ ప్రచారం చేసినా ఫలితం లేక పోయింది. ఉన్న సీటును ఆప్ కోల్పోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
ప్రధానంగా ఆప్ శిబిరంలో చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా ఇక్కడ ఎంపీగా గెలుపొందిన సిమ్రజింత్ సింగ్ మాన్ కు 77 ఏళ్లు. ఆయన శిరోమణి అకాలీదళ్ అమృత్ సర్ అధ్యక్షుడు కూడా.
ఇక సంగ్రూర్ ఎంపీ స్థానానికి బీజేపీకి చెందిన కేవల్ ధిల్లాన్ , కాంగ్రెస్ నుంచి దల్వీర్ సిం్ గోల్డీ, అకాలీదళ్ కు చెందిన కమల్ దీప్ కౌర్ రాజోనా వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు.
Also Read : సాధారణ కుటుంబాలు అసాధారణ విజయాలు