Singer Kalpana: సింగర్ కల్పన భర్తను విచారిస్తున్న పోలీసులు

సింగర్ కల్పన భర్తను విచారిస్తున్న పోలీసులు

Singer Kalpana : ప్రముఖ నేపథ్య గాయని కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. కల్పన బహుభాషా నేపథ్య గాయని. కేవలం గాయనిగానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే మంగళవారం సాయంత్రం ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న కల్పన(Singer Kalpana)ను అమె ఉంటున్న విల్లా వాసులు గుర్తించి… హుటాహుటీన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Singer Kalpana Case Updates

మొదటి భర్తతో విడాకులు తీసుకున్న ఆమె రెండో భర్త తో కలిసి ఉంటున్నారు. రెండు రోజులుగా ఆమె ఇంట్లోనే ఉన్నారు. చెన్నై లో ఉంటున్న భర్త ఫోన్ చేయగా కల్పన(Singer Kalpana) ఎత్తకపోవడంతో స్దానిక విల్లా వాసులకు ఆయన ఫోన్ చేశారు. అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇంటికి వచ్చిన పోలీసుల సహాయంతో విల్లా వాసులు ఇంటి తలుపులు బ్రేక్ చేసి… బెడ్ రూంలో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను ఆసుపత్రిలో చేర్చారు. మంగళవారం రాత్రి చెన్నై నుంచి ఆసుపత్రికి వచ్చిన కల్పన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం కల్పన ఉంటున్న ఇంటికి తీసుకెళ్ళారు. మానసిక ఒత్తిడి కారణంగా అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

చెన్నైకి చెందిన ఆమె భర్త ప్రసాద్‌ కూడా మంగళవారం ఉదయం నుంచి ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో ఆయన కెపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి ప్రధాన ద్వారం తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇంటి వెనక వంట గది నుంచి లోపలికి వెళ్లారు. అప్పటికే కల్పన(Singer Kalpana) అపస్మారక స్థితిలో మంచంపై పడి ఉన్నారు. ఆమె నిద్ర మాత్రలు మింగినట్లు గుర్తించారు. హుటాహుటిన కల్పనను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని.. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. కల్పన భర్త ప్రసాద్‌ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. అతన్ని పోలీసులు ఇంటికి తీసుకెళ్లి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న కల్పనను చూసేందుకు సునీత, గీతామాధురి, శ్రీకృష్ణ, కారుణ్య తదితరులు ఆస్పత్రికి వచ్చారు.

  • జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని కల్పన పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2010లో భర్తతో విడాకులు తీసుకున్న సమయంలో ఎదురైన సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని… అప్పుడు ప్రముఖ గాయని చిత్ర తనకు ధైర్యం చెప్పారని ఓ ఇంటర్వ్యూలో కల్పన చెప్పారు. భర్తతో విడిపోయిన తర్వాత కుటుంబాన్ని పోషించుకోవడం కష్టమైందని, పిల్లలను చదివించుకోలేకపోయానని కూడా ఆమో ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిత్ర సూచన మేరకు పాటల పోటీలో పాల్గొని గెలవడంతో తన కష్టాలు తీరాయని చెప్పారు. బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళగా కల్పనకు చిత్ర పరిశ్రమలో గుర్తింపు ఉందని, అలాంటి వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించారంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.

Also Read : Actress Ranya Rao: గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో కన్నడ నటి అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!