Singer Saichand : గాయకుడి మరణం తెలంగాణకు నష్టం
సాయిచంద్ మృతికి కేసీఆర్ సంతాపం
Singer Saichand : ప్రముఖ గాయకుడు సాయిచంద్ ఆకస్మికంగా మరణించడంతో తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర విచారం చోటు చేసుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకమైన పాత్ర పోషించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా తన గొంతును ఇచ్చారు. సీఎం కేసీఆర్ ప్రతి సభలోనూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. సాయి చంద్ వయసు 39 ఏళ్లు. తన కుటుంబీకులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా కారుకొండలో ఉన్న ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఉన్నట్టుండి గుండె పోటుకు గురయ్యారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు. కానీ ఫలితం లేక పోయింది.
సింగర్ సాయిచంద్ స్వస్థలం వనపర్తి జిల్లా అమరచింత. 20 సెప్టెంబర్ 1984లో పుట్టారు. పీజీ దాకా చదువుకున్నారు. కళాకారుడిగా, సింగర్ గా గుర్తింపు పొందారు. ఇక తెలంగాణ మలిదశ పోరాటంలో ముఖ్య భూమికను పోషించారు. తన ఆట పాటలతో జనాన్ని చైతన్యవంతం చేశారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం ప్రభుత్వం తరపున తన గొంతుకను ఇచ్చారు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను పాటల రూపంలో పాడాడు సాయి చంద్(Saichand). ఇదిలా ఉండగా సింగర్ మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత, ఐటీ మినిష్టర్ కేటీఆర్ , ఎమ్మెల్యే ఈటల రాజేందర్ , తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read : Kamal Haasan Shankar : కమల్ సర్ ప్రైజ్ శంకర్ మెస్మ రైజ్