Sirimalle Poosindi Song : ‘సిరిమల్లె పూసింది’ గుండెల్ని మీటింది
రక్త సంబంధాల గొప్పతనం తెలిపే పాట
Sirimalle Poosindi Song : జానపదం ఝల్లుమంటోంది. గల గలా పారుతోంది. పల్లె ప్రజల జీవితాలను ప్రతిబింబించేలా పాటలు రూపు దిద్దుకుంటున్నాయి. తెలంగాణ జీవన చిత్రం పాటల్లో ఒలికించేందుకు కళాకారులు ప్రయత్నం చేస్తున్నారు.
అలాంటి పాటల్లో తాజాగా విడుదలైన సిరిమల్లె పూసింది పాట(Sirimalle Poosindi Song) విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు 40 మిలియన్ల మంది వ్యూస్ తో దూసుకు పోతోంది యూట్యూబ్ మాధ్యమంలో.
రోజు రోజుకు యాంత్రికమైన జీవితంలో బంధాలు మరింత పలుచనై పోతున్నాయి. రక్త సంబంధాల మధ్య ఉన్న బంధం ఎంత గొప్పదో దీని ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
పాట చిత్రీకరణ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇలాంటి పాటలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సాంగ్ ముఖ్య ఉద్దేశం ధనంతో పని లేదు. గుణం మంచిదైతే చాలంటుంది.
ఈ మాటలతో ఎంతో సంతోషించిన అన్నా వదినెలు తమ కూతురిని చెల్లెలి చేతిలో పెడతారు. దాంతో పాట సుఖాంతం అవుతుంది. ఈ పాటను రాసింది, దర్శకత్వం వహించింది నాగం పరశురాం. సంగీతాన్ని ఇచ్చింది ప్రవీణ్ కైతోజు.
పాటను లావణ్య రవీందర్ , అనిత పాడారు. రంగు అనిల్ గౌడ్ పాటను నిర్మించారు. ఈ పాటలో రాధిక, రజని, మారం ప్రవీణ్ కుమార్ , కరణ్ పటేల్ , లింగాల యాదగిరి, తెలంగాణ లక్ష్మి, సుమతి, మురళి నాగం, గాయత్రి, శ్రీనివాస్ , నవీన, విజయ లక్ష్మి, రాణి, హన్షిత పటేల్ , మాన్విత పటేల్ నటించారు.
వీలు కుదిరితే మీరు కూడా చూడండి. బంధాల అనుబంధాల మాధుర్యం ఏమిటో తెలుసుకోండి.
Also Read : ‘రాకెట్రీ..ది నంబి ఎఫెక్ట్’ అద్భుతం – తలైవా