AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్‌

ఏపీ లిక్కర్ స్కాంలో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్‌

AP Liquor Scam : వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై (AP Liquor Scam) సిట్‌ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 300 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్‌ను సిట్‌ అధికారులు కోర్టుకు సమర్పించారు. దీనితో పాటు వందకు పైగా ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను జతచేశారు. మొత్తం రూ.62 కోట్లు సీజ్‌ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 268 మంది సాక్షులను విచారించినట్లు ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు. 11 మంది వాంగ్మూలాలు, రిమాండ్‌ రిపోర్టులు, ఇతర పత్రాలను దీనికి జతచేశారు.

వివిధ బ్యాంకులు, ఆస్పత్రులు, బంగారం షాపులు, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో పెట్టుబడుల వివరాలకు సంబంధించిన స్టేట్‌మెంట్‌లను కూడా స్వాధీనం చేసుకుని ఛార్జ్‌షీట్‌లో సిట్‌ పొందుపరిచింది. వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి పేరు దీనిలో ఉన్నప్పటికీ ఆయన పాత్రను అధికారులు పేర్కొనలేదు. మద్యం ముడుపులు షెల్‌ కంపెనీల ద్వారా రావడం, బ్లాక్‌ను వైట్‌గా మార్చడం తదితర అంశాలను వెల్లడించింది. 20 రోజుల్లో మరో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని సిట్‌ తెలిపింది. దర్యాప్తు కీలక దశలో ఉందని… త్వరలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.

AP Liquor Scam – ఏపీ లిక్కర్‌ కేసులో ఐదు గంటలకు పైగా వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విచారణ

గత వైసీపీ పాలనలో జరిగిన లిక్కర్‌ స్కామ్ వ్యవహారం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విచారణ శనివారం సాయంత్రానికి ముగిసింది. ఐదు గంటలుగా ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. డొల్ల కంపెనీల నుంచి అంతిమ లబ్ధిదారునికి ముడుపులు చేర్చడంపై మిథున్ రెడ్డిని ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. మిథున్‌రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న పోలీసులు.. లిక్కర్‌ కేసు ప్రాథమిక చార్జ్‌షీట్లను కోర్టుకు తీసుకెళ్తున్నట్లు సమాచారం.

Also Read : Minister Vangalapudi Anitha: అశోక్ గజపతిరాజు ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అనిత

Leave A Reply

Your Email Id will not be published!