AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డి సంస్థల్లో సిట్ సోదాలు

ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డి సంస్థల్లో సిట్ సోదాలు

AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్‌లోపలు ప్రాంతాల్లో శనివారం కీలక సోదాలు నిర్వహించారు. మాజీ సీఎం జగన్‌ (YS Jagan) కు చెందిన భారతీ సిమెంట్స్‌లో సోదాలు సిట్ అధికారులు ప్రారంభించారు. సిట్ ఇప్పటికే అరెస్టు చేసిన బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్‌లో డైరెక్టర్‌ గా ఉండటంతో ఆ కంపెనీలో సోదాలు చేపట్టారు. రాజ్ కసిరెడ్డికి చెందిన రీసోర్స్ వన్ కంపెనీలో కూడా సిట్ సోదాలు చేశారు. ఇప్పటికే అరెస్టు అయిన చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టా రెంట్‌లో కూడా సిట్ అధికారులు సోదాలు ప్రారంభించారు. కార్యాలయాల్లో సోదాలతో పాటు ఎవరెవరూ ఎక్కడెక్కడ సమావేశం అయ్యారు, ఎన్నిసార్లు భేటీ అయ్యారనే అంశాలపై సాంకేతిక ఆధారాలతో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు.

AP Liquor Scam – Raj Kasireddy

బంజారాహిల్స్ భారతి సిమెంట్ కార్యాలయంలో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. భారతి సిమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో డాక్యుమెంట్లని సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆరుమందితో కూడిన సిట్ బృందం సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కాం (AP Liquor Scam) భారతి సిమెంట్ కేంద్రంగా నడిచిందని అనుమానాలు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. రూ.3500 కోట్ల స్కామ్ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఆరు డెన్లకు భారతి సిమెంట్ నుంచే ముడుపులు తరలించినట్లు గుర్తించారు. భారతీ సిమెంట్‌లో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టలరీల యజమానులతో సమావేశాలు నిర్వహించినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ సమావేశాల అనంతరం ముడుపులను భారతీ సిమెంట్ కంపెనీలో అందజేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మధ్యాహ్నం నుంచి సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఏడుగురు అధికారులతో కూడిన సిట్ బృందం సోదాలు చేస్తోంది.

Also Read : HCA Scam: హెచ్‌సీఏ స్కామ్‌లో జనరల్ సెక్రటరీ దేవరాజ్‌ అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!