SIT Raids: ఏపీ లిక్కర్ స్కాంలో జగన్ సన్నిహితుడి ఇంట్లో సిట్ సోదాలు

ఏపీ లిక్కర్ స్కాంలో జగన్ సన్నిహితుడి ఇంట్లో సిట్ సోదాలు

SIT Raids : ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. సునీల్ రెడ్డికి చెందిన హైదరాబాద్‌, విశాఖలోని 10 కంపెనీల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పది కంపెనీలకు గానూ ఐదు కార్యాలయాల్లో సిట్ అధికారులు తనిఖీలు (SIT Raids) చేస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్నంల్లోని ఐదు కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

SIT Raids For AP Liquor Scam

బంజారాహిల్స్ రోడ్ నెంబర్-3 -స్నేహా హౌస్, బంజారాహిల్స్ – రోడ్ నెంబర్ – 2- సాగర్ సొసైటీ, కాటేదాన్ – రాజేందర్ నగర్, ఖైరతాబాద్ – కమలాపురి కాలనీ – ఫేజ్ వన్‌లో ఉన్న కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. వాల్తేర్ రోడ్ – వెస్ట్ వింగ్ – విశాఖపట్నంలో ఉన్న మరో కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ – విశాఖపట్నంల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు సిట్ అధికారులు. హైదరాబాద్‌లోని 8 కంపెనీలకు గానూ 4 కార్యాలయాలు, విశాఖపట్నంలోని రెండు కంపెనీల్లో ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు సునీల్ రెడ్డి.

ఆర్ ఆర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్, గ్రీన్ స్మార్ట్ ఇన్‌ఫ్రా కాన్, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్, శేఖర్ ఫౌండేషన్, గ్రీన్ టెల్ ఎంటర్ ప్రైజెస్, గ్రీన్ కార్ట్ మీడియా, వయోలేటా ఫర్నిచర్స్, గ్రీన్ స్మార్ట్, జెన్సీస్ పెట్రో కెమికల్స్ అండ్ లాజిస్టిక్స్, గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రెడింగ్ కంపెనీలు నిర్వహిస్తున్నారు సునీల్ రెడ్డి. ప్రైవేట్ లిమిటెడ్, LLP, ఫౌండేషన్ హోదాల్లో సునీల్ రెడ్డి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. సునీల్ రెడ్డి కంపెనీల్లో సిట్ అధికారులు సోదాలు చేస్తుండటంతో కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Also Read : Telugu Tourists: మంత్రి లోకేశ్ చొరవతో విశాఖ చేరుకున్న నేపాల్ బాధితులు

Leave A Reply

Your Email Id will not be published!