Rakesh Tikait : 24న దేశ వ్యాప్తంగా ఎస్కేఎం ఆందోళ‌న‌

అగ్నిప‌థ్ స్కీంకు వ్య‌తిరేకంగా నిర‌స‌న

Rakesh Tikait : దేశ వ్యాప్తంగా కేంద్రం తీసుకు వ‌చ్చిన అగ్నిప‌థ్ స్కీంపై భ‌గ్గుమంటోంది. ఎక్క‌డ చూసినా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు మిన్నంటాయి. ఈ త‌రుణంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వ‌ర్యంలో ఈనెల 24న దేశ మంత‌టా నిర‌స‌న చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

సోమ‌వారం ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు భార‌తీయ కిసాన్ మోర్చా – బీకేయూ జాతీయ నేత‌, ఎస్కేఎం అగ్ర నాయ‌కుడు రాకేశ్ తికాయ‌త్(Rakesh Tikait).

ఎస్కేఎం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కీల‌క స‌మావేశంలో యువ‌త‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ చేసేందుకు, వారికి అండ‌గా నిలిచేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు.

దేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, త‌హ‌సిల్ ప్ర‌ధాన కార్యాల‌యాల్లో ఐక్య కిసాన్ మోర్చా ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేప‌డ‌తామ‌న్నారు. హ‌ర్యానా లోని క‌ర్నాల్ లో ఎస్కేఎం మీటింగ్ జ‌రిగింది.

స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు రాకేశ్ తికాయ‌త్(Rakesh Tikait). బీకేయూ కూడా పార్టిసిపేట్ చేస్తుంద‌ని తెలిపారు. ఎస్కేఎం నిర్వ‌హించిన పోరాటానికి కేంద్రం దిగి వ‌చ్చింది.

తాజాగా కాంట్రాక్టు ప‌ద్ద‌తిన సాయుధ ద‌ళాల‌లో యువ‌కుల‌ను తీసుకోవ‌డం దేనికి నిద‌ర్శ‌మ‌ని ప్ర‌శ్నించారు తికాయ‌త్. ఇదంతా దేశం కోసం కాద‌ని కొంద‌రి ప్ర‌యోజ‌నాల కోస‌మేన‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

దేశ వ్యాప్తంగా ఆందోళ‌న చేప‌ట్టిన యువ‌కుల‌కు సంయుక్త కిసాన్ మోర్చా బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు తెలిపింది. ఇప్ప‌టికైనా కేంద్రం అగ్నిప‌థ్ పై పున‌రాలోచించు కోవాల‌ని సూచించారు.

లేక‌పోతే యువ‌త ఆగ్ర‌హానికి గురి కావాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు తికాయ‌త్.

Also Read : రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి రేసులో లేను – గాంధీ

Leave A Reply

Your Email Id will not be published!