Smriti Irani : మంత్రి కామెంట్స్ స్మృతీ ఇరానీ సీరియస్
రాష్ట్రపతిపై అఖిల్ గిరి అనుచిత వ్యాఖ్యలు
Smriti Irani : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేశారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి అఖిల్ గిరి. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ లాకెట్ ఛటర్జీ మండిపడింది.
ఆపై ఢిల్లీలో ఆదివారం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే సీఎం క్షమాపణ చెప్పాలని, తక్షణమే కేబినెట్ నుంచి తొలగించాలని కోరింది. ఈ తరుణంలో ఆదివారం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) సీరియస్ గా స్పందించారు. ఆమె సీఎం మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు.
అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎవరి సహాయ సహకారాలు లేకుండా ఎదిగిన రాష్ట్రపతి గురించి నీచపు మాటలు ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికీ మంచిది కాదని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లను కేబినెట్ లో ఎలా మంత్రిగా కొనసాగిస్తున్నారంటూ దీదీని నేరుగా ప్రశ్నించారు కేంద్ర మంత్రి.
వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ బహిరంగ క్షమాపణ చెప్పాలని సీఎంను డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఇలాంటి మంత్రులు ప్రజలకు ఎలా సేవలు చేస్తారంటూ నిలదీశారు స్మృతీ ఇరానీ(Smriti Irani). ఇందుకు బాధ్యత వహిస్తూ ముందు మంత్రి పదవి నుంచి తొలగించాలని, ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని కోరారు.
దీనిపై ఇంకా దీదీ స్పందించ లేదు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్నా సీఎం స్పందించక పోవడం దారుణమని పేర్కొంది బీజేపీ.
Also Read : దీదీ క్షమాపణ చెప్పాల్సిందే – లాకెట్ ఛటర్జీ