Menaka Gandhi : గాడిద పాలతో స్నానం అందానికి సోపానం
గాడిద పాలు..మేక పాలతో సబ్బులు తయారు చేయండి
Menaka Gandhi Viral : బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి , జంతు హక్కుల కార్యకర్త అయిన మేనకా గాంధీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. గాడిద పాలతో తయారు చేసిన సబ్బులను వాడడం వల్ల అందం మరింత రెట్టింపు అవుతుందంటూ కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. సబ్బులు తయారు చేసేందుకు గాడిద పాలను ఉపయోగించే లడఖ్ సంఘం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆమె.
గాడిద పాలతో తయారు చేసిన సబ్బులు స్త్రీల శరీరాన్ని అందంగా ఉంచుతాయని పేర్కొన్నారు. అంతే కాదు ఆనాడు ఈజిప్ట్ క్వీన్ క్లియో పాత్రా కూడా గాడిద పాలతో స్నానం చేసిందని గుర్తు చేశారు మేనకా గాంధీ(Menaka Gandhi Viral).
ఉత్తర ప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లో చౌపాల్ ని ఉద్దేశించి మేనకా గాందీ మాట్లాడారు. ఢిల్లీలో గాడిద పాలతో తయారు చేసిన సబ్బుల ధర రూ. 500 అని పేర్కొన్నారు. మీరెందుకు గాడిద పాలు, మేక పాలతో సబ్బులు తయారు చేయకూడదంటూ ప్రశ్నించారు లడఖ్ సంఘాన్ని.
అటవీ నిర్మూలనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆవు పేడ దుంగలకు సుగంధ పదార్థాన్ని జోడించాలని సలహా ఇచ్చారు. మరణించిన వారిని దహనం చేసే సమయంలో వీటిని ఉపయోగించేందుకు వీలుంటుందన్నారు. ఈ దుంగలను విక్రయించడం ద్వారా లక్షలు సంపాదించ వచ్చంటూ సలహా ఇచ్చారు మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ(Menaka Gandhi).
Also Read : హిమపాతం ఆరుగురు దుర్మరణం