S Jai Shankar : టెర్రరిస్ట్ టూల్ కిట్ గా సోషల్ మీడియా
విదేశాంగ శాఖ మంత్రి షాకింగ్ కామెంట్స్
S Jai Shankar : టెర్రరిస్ట్ టూల్ కిట్ గా సోషల్ మీడియా మారిందంటూ సంచలన కామెంట్స్ చేశారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్. టెర్రరిజం వ్యాప్తి కోసం శక్తివంతమైన సాధనాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి రెండు రోజుల ఉగ్రవాద వ్యతిరేక సమావేశానికి భారత్ ఆతిథ్యం వహిస్తోంది.
ఉగ్రవాద నిరోధక కమిటీ (సీటీసీ) భారత్ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశం జరుగుతోంది. ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు, తీవ్రవాద గ్రూపుల టూల్ కిట్ లో ప్రచారం జరుగుతోంది. రాడికలైజేషన్ లో శక్తివంతమైన సాధానాలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సమాజాలను అస్థిర పరిచేందుకు ఉద్దేశంచిన కుట్ర సిద్దాలు, వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్స్ , ఎన్ క్రిప్టెడ్ మెసేజ్ సర్వీసెస్ , బ్లాక్ చెయిన్ వంటి సాంకేతికతలు ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలకు కొత్త సవాళ్లను విసురుతున్నాయని జై శంకర్(S Jai Shankar) అభిప్రాయపడ్డారు.
అంతే కాక మానవత్వానికి తీవ్ర ముప్పును ఎదుర్కొనేందుకు యుఎన్ భద్రతా మండలి ఉత్తమ ప్రయత్నాలు చేసినప్పటికీ ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికాలో ఉగ్రవాదం పేట్రేగి పేరుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
రోజు రోజుకు ఉగ్రవాదం ముప్పుగా మారిందని , దీనిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందన్నారు. తీవ్రవాద వ్యతిరేక కమిటీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం కూడా భద్రతా మండలిలో ఒక భాగమని పేర్కొన్నారు జై శంకర్.
తీవ్రవాదాన్ని ప్రభుత్వ నిధులతో కూడిన సంస్థగా మార్చిన ఆ దేశాలను నోటీసులో ఉంచడంలో ఇది చాలా ప్రభావంతంగా ఉంటుందన్నారు జై శంకర్.
Also Read : ఉగ్రవాదులు దేశాలకు పెను సవాల్