Somu Veerraju : బండి అరెస్ట్ పై సోము సీరియస్
రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయం
Somu Veerraju Bandi Arrest : తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేయడంపై ఏపీ బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు(Somu Veerraju Bandi Arrest) నిప్పులు చెరిగారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. పేపర్ లీకేజీల వ్యవహారం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇందుకు ప్రభుత్వాన్ని నిలదీసిన బండిపై కేసు ఎలా నమోదు చేస్తారంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం అటు తెలంగాణలో ఇటు ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందంటూ మండిపడ్డారు.
ప్రజా సమస్యలను ప్రస్తావించడం నేరంగా మారిందన్నారు. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు పొక్కిందని దానిని కూడా నిలదీసినందుకే తట్టుకోలేక తెలంగాణ సర్కార్ బీజేపీ స్టేట్ చీఫ్ ను టార్గెట్ చేసిందని ఆరోపించారు. అయినా బీజేపీకి కేసులు, జైళ్లు కొత్త కాదన్నారు సోము వీర్రాజు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే, నిలదీసే హక్కు ఉంటుందని ఆ విషయాన్ని ఏలుతున్న వారు మరిచి పోతే ఎలా అని నిలదీశారు.
రాబోయే రోజుల్లో కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ అరెస్ట్ లు జరుగుతున్నాయని ఆరోపించారు మరో సీనియర్ కాంగ్రెస్ నేత విష్ణు వర్దన్ రెడ్డి.
Also Read : బండి అరెస్ట్ అప్రజాస్వామికం