Sonia Gandhi Comment : సోనియా అంత‌రంగం ఎవ‌రికి ఎరుక‌

మేడం సుప్రీం లేకుంటే క‌ష్టం

Sonia Gandhi Comment : సోనియా గాంధీ గురించి ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. స‌మున్న‌త రాజ‌కీయ చ‌రిత్ర‌కు ఆల‌వాల‌మైన కాంగ్రెస్ పార్టీలో గాంధీ ఫ్యామిలీ నుంచి వేరు చేయ‌లేం. అంత‌లా పెన వేసుకు పోయింది.

భార‌త దేశ చ‌రిత్ర అంటేనే గాంధీ చ‌రిత్ర గురించి చెప్పాల్సి వ‌స్తుంది. రాజీవ్ గాంధీ దారుణ హ‌త్య‌కు గురైన త‌ర్వాత ఇంకొక‌రైతే దేశం విడిచి పారి

పోవ‌డ‌మో లేదా రాజ‌కీయాలకు దూరంగా ఉండ‌ట‌మో జ‌రిగి ఉండేది.

కానీ ఆమె ఏ ముహూర్తంలో రాజీవ్ గాంధీపై మ‌న‌సు పారేసుకుందో కానీ ఆనాటి నుంచి నేటి దాకా ఎక్క‌డా ఎవ‌రినీ ప‌ల్లెత్తు మాట అన్న దాఖ‌లాలు లేవు.

ప‌రుష ప‌ద‌జాలం ఉప‌యోగించింది కూడా లేదు.

మెల మెల్ల‌గా దేశంలో చోటు చేసుకున్న ప‌రిణామాలు, సంఘ‌ట‌న‌ల‌ను సోనియా గాంధీ(Sonia Gandhi) అర్థం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తూ వ‌చ్చారు. రాను రాను పార్టీ త‌న క‌నుస‌న్న‌ల‌లో ఉండేలా త‌న‌ను తాను మ‌ల్చుకున్నారు.

కుటుంబాన్ని న‌డ‌ప‌డం సుల‌భ‌మే కానీ వందేళ్ల‌కు పైగా ఘ‌న‌మైన వార‌స‌త్వం, చ‌రిత్ర క‌లిగిన పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాలంటే మాట‌లు కాదు. చాలా అనుభ‌వం కావాలి. అంత‌కంటే దేశం ప‌ట్ల నిబ‌ద్ద‌త ఉండాలి. దానికంటే ఎక్కువ‌గా రాజ‌కీయం తెలిసి ఉండాలి.

అనుభ‌వ పూర్వ‌కంగా ప్ర‌తి దానిని ప‌రిష్క‌రించే నైపుణ్యం, ప్ర‌తిభా పాట‌వాలు క‌లిగి ఉండాలి. కానీ వాట‌న్నిటి కంటే ఎక్కువ‌గా ప‌రిణ‌తి చెందిన

నాయ‌కురాలిగా త‌న‌ను తాను మ‌ల్చుకునే ప్ర‌య‌త్నం చేస్తూనే వ‌చ్చారు.

ఓ వైపు కొడుకు రాహుల్ గాంధీ మ‌రో వైపు కూతురు ప్రియాంకా గాంధీ , అల్లుడు రాబ‌ర్ట్ వాద్రా రాజ‌కీయ వార‌సత్వంతో పాటు ఎన‌లేని ఆరోప‌ణ‌లు, ఆపై

కేసులు, విమ‌ర్శ‌లు అన్ని వైపులా సోనియా గాంధీని చుట్టుముడుతూనే ఉన్నాయి.

మొన్న‌టికి మొన్న కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ నేష‌న‌ల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి విచార‌ణకు హాజ‌ర‌య్యారు. త‌న హుందాత‌నాన్ని కాపాడుకున్నారు. ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఏమీ మాట్లాడ‌లేదు. ఎవ‌రి ప‌ట్లా ఆరోప‌ణ‌లు సంధించ‌లేదు.

పార్టీ అన్నాక అంద‌రూ బాగుండాల‌ని రూలేం లేదు. ఎందుకంటే ఇవాళ రాజ‌కీయాలు అంటేనే ఆశ్రిత ప‌క్ష‌పాతం, కుటుంబ నేప‌థ్యం, అవినీతి, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా మారాయి.

ఒక ర‌కంగా చెప్పాలంటే భ్ర‌ష్టు ప‌ట్టి పోయాయి. విలువ‌లు క‌లిగిన నాయ‌కులు ఎవ‌రున్నార‌ని భూత‌ద్దంలో చూడాల్పిన ప‌రిస్థితి నెల‌కొంది. ఆమె

హ‌యాంలోనే కాంగ్రెస్ పార్టీ ఒక వెలుగు వెలిగింది.

అంత‌లోపే తీవ్ర‌మైన ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటోంది. ఇదే క్ర‌మంలో జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం, స‌మాచార హ‌క్కు చ‌ట్టం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అన్న‌ది సోనియా గాంధీ(Sonia Gandhi) మ‌ద్ద‌తుతోనే జ‌రిగింద‌న్న‌ది అక్ష‌రాల స‌త్యం.

ఒక ర‌కంగా దేశం ఆమెకు రుణ‌ప‌డి ఉండాలి. ఏది ఏమైనా ప్ర‌త్య‌ర్థుల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టడంలో కీల‌క‌మైన నాయ‌కుడిగా పేరొందిన ప్ర‌ధాన మంత్రి

న‌రేంద్ర మోదీ మేడం విష‌యంలో మెత‌క వైఖ‌రి క‌లిగి ఉన్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు.

ఏది ఏమైనా సోనియా గాంధీ విదేశీయురాలా లేక దేశీయురాలా అన్న‌ది ప‌క్క‌న పెడితే నాయ‌కురాలిగా పేర్కొన‌డంలో ఎంత‌మాత్రం సందేహం అక్క‌ర్లేదు.

Also Read : మేడం చేతిలో రాజ‌స్థాన్ భ‌విత‌వ్యం

Leave A Reply

Your Email Id will not be published!