Sonia Gandhi Discharged : ఆస్పత్రి నుంచి ‘సోనియా’ డిశ్చార్జి
23న ఈడీ ముందుకు హాజరు కానున్నారా
Sonia Gandhi Discharged : కోవిడ్ అనంతర సమస్యల కారణంగా ఢిల్లీలోని గంగా రాం ఆస్పత్రిలో చేరిన వారం రోజుల తర్వాత ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ సోమవారం డిశ్చార్జి(Sonia Gandhi Discharged) అయ్యారు.
75 ఏళ్ల సోనియా గాంధీ జూన్ 2న కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆమెకు పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
ఇదిలా ఉండగా నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది సీబీఐ. భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్య స్వామి ఈ మేరకు మనీ లాండరింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేశారు.
ఇందులో భాగంగా ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ సర్కార్ హయాంలో కొట్టి వేసిన ఈ కేసును తిరిగి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఓపెన్ చేసింది.
ఇందులో భాగంగా సోనియా గాంధీకి, తనయుడు , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీకి సమన్లు పంపించింది. ఇప్పటికే ఆయన ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు.
వరుసగా మూడు రోజుల పాటు హాజరైన రాహుల్ గాంధీ రెండు రోజులు గడువు అడిగారు. తిరిగి సోమవారం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు.
ఆయన వెంటన సోదరి ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యారు. కాగా రూ. 90 కోట్లు చేతులు మారాయంటూ ఆరోపణలు ఉన్నాయి.
ఇదే కేసుకు సంబంధించి సోనియా గాంధీ కూడా ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా కరోనా కారణంగా వెళ్లలేదు. ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి(Sonia Gandhi Discharged) కావడంతో ఈనెల 23న ఈడీ ముందు హాజరయ్యే చాన్స్ ఉంది.
Also Read : రాష్ట్రపతి అభ్యర్థి రేసులో లేను – గాంధీ
🔴#JustIn | Sonia Gandhi discharged from hospital, faces questioning in alleged money laundering case https://t.co/Vr6SKb6WFa pic.twitter.com/YI7k6ULNiC
— NDTV (@ndtv) June 20, 2022