Sonia Gandhi : సీపీపీ చైర్ పర్సన్, ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ లో చోటు చేసుకున్న హింసపై తీవ్రంగా స్పందించారు. దయచేసి సంయమనం పాటించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని వర్గాల వారు కలిసి ఉండాలని సూచించారు. మణిపూర్ అగ్నిగుండంగా మారినా ఎందుకని అక్కడి బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు సోనియా గాంధీ.
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఓ వైపు మణిపూర్ కాలి పోతుంటే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకని నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని ఆవేదన చెందారు.
ఇదిలా ఉండగా మణిపూర్ లో ఘర్షణలు చోటు చేసుకుని 50 రోజులకు పైగా అవుతోంది. ఇప్పటి వరకు 100 మందికి పైగా చని పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. 50 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. 10 వేల మందికి పైగా సైనికులు మోహరించారు. కానీ అల్లర్లు కంట్రోల్ కాక పోవడం దారుణమన్నారు సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi).
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ చంద్ర షా వెళ్లి వచ్చినా ఏం చేశారంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం మణిపూర్ పై ఫోకస్ పెట్టాలని సూచించారు. లేక పోతే దేశం మరో మణిపూర్ లాగా మారి పోతోందని హెచ్చరించారు.
Also Read : Bhagwant Mann Comment : జీతే రహో భగవంత్ మాన్
