Sonia Gandhi: ప్రజలు కాంగ్రెస్‌ పట్ల సానుకూలంగా ఉన్నారు: సోనియా గాంధీ

ప్రజలు కాంగ్రెస్‌ పట్ల సానుకూలంగా ఉన్నారు: సోనియా గాంధీ

Sonia Gandhi: ముందున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ నాయకులు సమాయత్తం కావాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ బుధవారం ప్రణాళికలును సీద్గం చేసీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ముందస్తు వ్యూహాలు రచిస్తోంది. బుధవారం జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi) నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమకు ప్రజలు మద్దతిచ్చారని, అది అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగేలా నాయకులు మసులుకోవాలని సూచించారు.

Sonia Gandhi Comment

లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను మనం చూశాం.. ప్రజలు మనవైపే ఉన్నారు. రానున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నాయకులు సమాయత్తం కావాలి. శ్రమించి పనిచేస్తే లోక్‌సభ ఎన్నికల్లో వలే ఫలితాలు రావొచ్చు. కానీ, అతినమ్మకం పనికిరాదు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా మెజారిటీ కోల్పోయింది. అయినా, మోదీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుండా ప్రజలను వర్గాలుగా విభజిస్తూ, శత్రుత్వాన్ని వ్యాప్తి చేస్తోంది అని ఆమె పేర్కొన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో రైతులు, యువతను పూర్తిగా విస్మరించారని సోనియా మండిపడ్డారు. కీలకమైన రంగాల్లో పెండింగ్‌ పనులకు కేటాయింపుల్లో న్యాయం చేయలేదని విమర్శించారు. కావడి యాత్రలో విధించిన నియమాలు ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయని, సుప్రీం కోర్టు సరైన సమయంలో జోక్యం చేసుకుందన్నారు.

Also Read : Pawan Kalyan: వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యల కేసులో హైకోర్టులో పవన్ కళ్యాణ్ కు ఊరట !

Leave A Reply

Your Email Id will not be published!