Sonia Gandhi: మాతృ వందన యోజనకు నిధులేవీ – సోనియా గాంధీ

మాతృ వందన యోజనకు నిధులేవీ - సోనియా గాంధీ

Sonia Gandhi : గర్భిణుల కోసం కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) అమలు లోపభూయిష్టంగా ఉందని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ(Sonia Gandhi) ఆరోపించారు. పీఎంఎంవీవై పథకానికి నిధులు బడ్జెట్ లో అంతంతమాత్రంగానే కేటాయిస్తున్నారని విమర్శించారు. బుధవారం రాజ్యసభలో జీరో అవర్ లో పీఎంఎంవీవై పథకంపై ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి మాతృ వందన యోజన(పీఎంఎంవీవై)కు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. గర్భిణుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని ప్రభుత్వానికి సూచించారు. గర్భిణులకు ప్రయోజన కరమైన పథకానికి నిధులు ఇవ్వకుండా మొండిచెయ్యి చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

Sonia Gandhi Comment

‘‘2013లో కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా గర్భిణులకు రెండు విడతల్లో రూ.6,000 చెల్లించేవారు. 2017 నుంచి పీఎంఎంవీవై కింద రూ.5,000 మాత్రమే ఇస్తున్నారు. 2022-23 లెక్కలను విశ్లేషిస్తే.. తొలిసారి గర్భం దాల్చిన వారిలో 68 శాతం మంది కనీసం ఒక విడత సొమ్ము అందుకున్నారు. కానీ ఆ తర్వాతి ఏడాది ఆ సంఖ్య 12 శాతానికి పడిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో పీఎంఎంవీవైని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే ప్రతిఏటా కనీసం రూ.12,000 కోట్లు అవసరమని సోనియా గాంధీ వివరించారు. 2025–26 బడ్జెట్‌లో మాత్రం అరకొర నిధులే కేటాయించారని విమర్శించారు.

అమిత్‌ షాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

రాజ్యసభలో సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాపై కాంగ్రెస్‌ ఎంపీ జైరామ్‌ రమేశ్‌ బుధవారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ బిల్లు–2024పై చర్చ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలోకేవలం ఒక్క కుటుంబమే అధికారం చెలాయించిందని, అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు(సోనియా గాంధీ) కూడా ఆ కుటుంబంలో ఉన్నారని చెప్పారు. దీనిపై జైరామ్‌ రమేశ్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. అమిత్‌ షాపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలని కోరుతూ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌కు నోటీసు అందశేశారు.

Also Read : Supreme Court: లైంగిక వేధింపుల కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Leave A Reply

Your Email Id will not be published!