Sonia Gandhi : అధికార దుర్వినియోగం రాజ్యాంగ వ్యతిరేకం
ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ కామెంట్స్
Sonia Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని దుర్వినియోగం చేసే వారే నిజమైన జాతీయ వ్యతిరేకులు అని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర పోరాట చరిత్ర గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ , పటేల్ , తదితరులతో నిండి ఉందన్నారు. అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ వారు గీత దాటలేదన్నారు. అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పాలనా రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు సోనియా గాంధీ.
ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్బంగా ఆమె ఘాటుగా స్పందించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించు కునేందుకు ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. మతం ప్రాతిపదికన భారతీయులను విభజించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రస్తుత పాలక వర్గం స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం, న్యాయానికి సంబంధించిన పునాదాలను బలహీన పరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు సోనియా గాంధీ(Sonia Gandhi) .
ప్రజల హక్కులన రక్షించాల్సిన ప్రభుత్వం వారిని వేధింపులకు గురి చేసేందుకు చట్టాన్ని ఉపయోగించు కుంటోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఉద్దేశ పూర్వకంగానే ఈ దేశంలో ద్వేష భావాన్ని కలుగ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రకంగా బెదిరింపులకు దిగుతుండడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు సోనియా గాంధీ. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
Also Read : సమున్నత భారతావనికి దిక్సూచి