Sonia Gandhi BJP : విద్వేషాలను ఎగదోస్తున్న బీజేపీ – సోనియా
సమాజంలో దాడులు..గొడవలకు పాల్పడితే ఎలా
Sonia Gandhi BJP : ఐఏసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. విద్వేష రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ(Sonia Gandhi BJP) పాల్పడుతోందంటూ ఆమె ఆరోపించారు. మైనార్టీలు, దళితులు, గిరిజనులు, మహిళలపై విద్వేషాలకు ఆజ్యం పోస్తోందంటూ ధ్వజమెత్తారు. ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో జరుగుతున్న 85వ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలలో సోనియా గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఇదే సమయంలో గౌతం అదానీపై కూడా నిప్పులు చెరిగారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిస్సిగ్గుగా ఆర్థిక సామ్రాజ్యానికి బహిరంగంగా మద్దతు పలకడం దారుణమన్నారు. వ్యాపారవేత్తకు అనుకూలంగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వం ఆర్థిక నాశనానికి కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు బతికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
ఇలా అయితే ఎలా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వంపై సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ద్వేష పూరిత అగ్నికి ఆజ్యం పోస్తోందంటూ ఫైర్ అయ్యారు. ప్రస్తుత పాలనలో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు బతికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ప్రస్తుత పాలనను పటిష్టంగా ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ సందేశాన్ని ప్రజలకు చేరవేయాలని అన్నారు సోనియా గాంధీ.
కాంగ్రెస్ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని అన్ని మతాలు, కులాల గొంతులను ప్రతిబింబించేలా చేస్తుందన్నారు. వారందరి కలలను పార్టీ నెరవేరుస్తుందన్నారను సోనియా గాంధీ(Sonia Gandhi BJP). ఇది కాంగ్రెస్ , దేశానికి ప్రత్యేకించి సవాలుతో కూడిన సమయం , ప్రధాని మోడీ, బీజేపీ ప్రతి సంస్థను స్వాధీనం చేసుకున్నాయంటూ ఆరోపించారు .
Also Read : బీజేపీ సేవలో ఏఎన్ఐ