Sonia Gandhi: మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ
మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ
Sonia Gandhi : కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి మహా కుంబాభిషేకం ఘనంగా నిర్వహించినందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీ(Sonia Gandhi) ప్రశంసించారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు లేఖ రాశారు. 42 సంవత్సరాల తర్వాత ప్రత్యేక చొరవ తీసుకొని కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి మహా కుంబాభిషేకం నిర్వహించడం హర్షణీయమని సోనియా గాంధీ అన్నారు. ఈ సందర్భంగా త్రివేణి సంగమం జలాలకు ఎంతో ప్రత్యేకత ఉందని ఏఐసీసీ అగ్రనేత.ప్రస్తావించారు. తనకు ప్రసాదాన్ని, త్రివేణి సంగమం పవిత్ర జలాలను పంపించిందుకు కొండా సురేఖకు సోనియాగాంధీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దాంతోపాటు, కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి స్థల విశిష్టతను, ప్రశస్థను తెలియజేసినందుకు కొండా సురేఖను సోనియా గాంధీ అభినందించారు.
Sonia Gandhi Write a Letter to
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి 42 ఏళ్ల తర్వాత మహాకుంభాభిషేకం జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ క్రతువు కోసం దేవాదాయ, ఇతర శాఖల అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లను చేశారు. 1982లో చివరిసారిగా కాళేశ్వరుడి కుంభాభిషేకం నిర్వహించారు. నాటి శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యుల ఆధ్వర్యంలో క్రతువును జరిపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తుని తపోవన ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీస్వామి, ఆయన శిష్య బృందం, రుత్విజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ 1,108 కలశాలకు పూజలు చేశారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రు లు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరు కాగా, వారికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభామేళా జరుగుతున్న తరుణంలోనే కాళేశ్వరంలో త్రివేణి సంగమంలో ఈ మహోత్సవం 3 రోజులపాటు జరిగింది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాం తాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి… త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు.
Also Read : Singer Kalpana: సింగర్ కల్పన భర్తను విచారిస్తున్న పోలీసులు