Sonu Sood: చెఫ్ అవతారం ఎత్తిన సోనూసూద్ ! రెట్టింపు రేటుకు దోశ ?
చెఫ్ అవతారం ఎత్తిన సోనూసూద్ ! రెట్టింపు రేటుకు దోశ ?
Sonu Sood : సినిమా నటుడి కంటే కరోనా సమయంలో అనాధలకు, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న సెలబ్రెటీ సోనూసూద్(Sonu Sood). కరోనా తరువాత ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో మారుమూల గిరిజన గ్రామాలకు వైద్య సేవలు అందించడానికి తన వంతు సహాయంగా నాలుగు అంబులెన్స్ లను విరాళంగా ఇచ్చారు. అందులో రెండు అంబులెన్స్ లను పార్వతీపురం మన్యం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మరోవైపు సోనూసూద్ తరచూ చిరు వ్యాపారులకు సాయం అందిస్తుంటారు. తాజాగా సోనూసూద్(Sonu Sood) కు సంబంధించిన మరో వీడియో వైరల్గా మారింది. దానిలో సోనూసూద్ చెఫ్ అవతారంలో కనిపిస్తున్నారు.
Sonu Sood As a Chef Viral
సోను సూద్ ఇలీవల తమిళనాడులోని చెన్నైలో రోడ్డుపక్కనున్న ఒక టిఫిన్ సెంటర్కు వెళ్లారు. అతని బృందం కూడా అతని వెంట ఉంది. ఇంతలో సోనూసూద్(Sonu Sood) దోశె వేసేందుకు ప్రయత్నించారు. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ, ‘ఇది నా ఇడ్లీ సాంబార్ దుకాణం’ అని రాశారు. వీడియో క్లిప్ మొదట్లో సోనూసూద్ ఆ ఫుడ్ స్టాల్ యజమాని శాంతిని పరిచయం చేసుకున్నారు. తరువాత అక్కడ సిద్ధమైన వంటకాలన్నీ కనిపిస్తాయి. తరువాత కెమెరా కిచెన్ కౌంటర్ వైపు కదులుతుంది. అక్కడ కొబ్బరి పచ్చడి, సాంబారు, ఇడ్లీలతో కూడిన పాత్రలు ఉంటాయి.
ఇడ్లీ, వడ ప్లేటు పట్టుకున్న సోనూసూద్.. మూడు ఇడ్లీలు, రెండు వడల ధర కేవలం రూ. 35 అని చెబుతారు. దీనిపై మీకు నమ్మకం లేదా?’ అని ప్రశ్నిస్తారు. అయితే టిఫిన్ సెంటర్ యజమాని శాంతి ఆయనకు ఆ టిఫిన్ రూ. 30కే ఇస్తుంది. తరువాత సోనూసూద్ చెఫ్ అవతారమెత్తి దోశ వేసేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు శాంతి ప్లెయిన్ దోశ రూ. 15 అని చెబుతుంది. వెంటనే సోనూ సూద్ దోశ ధర రెండింతలు చేస్తూ రూ. 30 అయ్యిందని చెబుతారు. తరువాత ఆయన తన బృందంలోని సభ్యులందరికీ దోశలను వడ్డిస్తారు.
గతంలో కూమారి ఆంటీని కలిసిన సోనూసూద్ !
గత ఏడాది సోసూసూద్ హైదరాబాద్ లో ఫుడ్ స్టాల్ నిర్వాహకురాలు కుమారి ఆంటీని కలుసుకున్నారు. అప్పుడు ఆయన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోలో… కుమారి ఆంటీని పలుకరిస్తూ కనిపించారు. ‘నేను కుమారి ఆంటీ పక్కన ఉన్నాను. ఆమె గురించి చాలా విన్నాను. ఆమె స్వయంకృషితో ఎదిగిన మహిళ’ అని ఆమెను మెచ్చుకున్నారు. మహిళా సాధికారతకు కుమారి ఆంటీ ఉత్తమ ఉదాహరణ అని సోనూసూద్ అన్నారు. కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్లో సోనూసూద్ వెజిటేరియన్ మీల్స్ తిన్నారు.
Also Read : Nara Lokesh: ఉపాధ్యాయ బదిలీలపై అభిప్రాయాలు కోరిన మంత్రి లోకేశ్