ECI Refuses : సోరేన్ అనర్హత లేఖను బయట పెట్టలేం
స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
ECI Refuses : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ఎమ్మెల్యే అనర్హత వేటు వేయాలని స్పష్టం చేస్తూ గవర్నర్ కు లేఖ రాసింది కేంద్ర ఎన్నికల సంఘం.
అంతకు ముందు ఆయన సీఎం పదవిలో ఉన్న సమయంలోనే నిబంధనలకు విరుద్దంగా తన పేరుపై గనులు లీజుకు తీసుకున్నారంటూ జార్ఖండ్ భారతీయ జనతా పార్టీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదును ఉదహరిస్తూ సీఎంపై చర్యలు తీసుకోవచ్చా లేదా అని ఈసీకి లేఖ రాశారు. ఆధారాలు ఉంటే వెంటనే అనర్హత వేటు వేయవచ్చంటూ స్పష్టం చేసింది.
ఈ మేరకు లేఖ రాసింది. ఆ తర్వాత జార్ఖండ్ రాష్ట్రంలో అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసలు ప్రభుత్వం ఉంటుందో లేదోనన్న అంచనాలకు తెర దించే ప్రయత్నం చేశారు హేమంత్ సోరేన్(Hemant Soren).
ఆ తర్వాత వేటు వేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవడం, అనంతరం అసెంబ్లీలో బల నిరూపణకు దిగడం, విజయం సాధించడం జరిగింది. దీనిని సవాల్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం రాసిన లేఖను బయట పెట్టాలని కోరారు హేమంత్ సోరేన్.
శుక్రవారం దీనిపై స్పందించింది ఈసీ(ECI Refuses). ఆ లేఖను తాము బయట పెట్టలేమంటూ పేర్కొంది. ఇదిలా ఉండగా హేమంత్ సోరేన్ తరపు న్యాయవాది వైభవ్ తోమర్ గతంలో ఈసీకి లేఖ రాశారు.
వాచ్ డాగ్ విచారణలు న్యాయ పరమైనవి కాబట్టి తన క్లయింట్ సీఎం స్థానంపై అనిశ్చితికి ముగింపు పలికేందుకు లేఖ కాపీని షేర్ చేయాలని కోరారు. దీనిపై అభ్యంతరం తెలియ చేస్తూ ఈసీ తిరస్కరించింది.
Also Read : సచిన్ పైలట్ ను సీఎం చేస్తే వ్యతిరేకించం