Sourav Ganguly : శుభ్ మ‌న్ సూప‌ర్ – గంగూలీ

విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్

Sourav Ganguly : బీసీసీఐ మాజీ బాస్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ డైరెక్ట‌ర్ సౌర‌వ్ గంగూలీ(Sourav Ganguly) షాకింగ్ కామెంట్స్ చేశాడు. బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 197 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ 198 ప‌రుగులు ఇంకా 5 బంతులు మిగిలి ఉండ‌గానే విజ‌యాన్ని పూర్తి చేసింది.

ఆర్సీబీ త‌ర‌పున విరాట్ కోహ్లీ 13 ఫోర్లు 1 సిక్స్ అద్భుతంగా ఆడాడు. 101 ప‌రుగుల‌తో సెంచ‌రీ చేశాడు. అనంత‌రం గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టులో యంగ్ క్రికెట‌ర్ శుభ్ మ‌న్ గిల్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. కేవ‌లం 52 బంతులు ఎదుర్కొని దంచి కొట్టాడు. 5 ఫోర్లు 8 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. క‌ళ్లు చెదిరే బ్యాటింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. 104 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కోహ్లీ ఐపీఎల్ లో 7 సెంచ‌రీల‌తో అరుదైన రికార్డు న‌మోదు చేశాడు.

ఈ సంద‌ర్భంగా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాజీ బాస్ , ఢిల్లీ క్యాపిట‌ల్స్ డైరెక్ట‌ర్ సౌర‌వ్ గంగూలీ తీవ్రంగా స్పందించాడు. శుభ్ మ‌న్ గిల్ ఆట తీరు అద్భుతం అంటూ కొనియాడాడు. అయితే ఇదే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచ‌రీ చేసినా అత‌డి గురించి ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. కానీ గిల్ ను ఆకాశానికి ఎత్తేశాడు. దీంతో కోహ్లీని కావాల‌నే గంగూలీ టార్గెట్ చేశాడంటూ ఫ్యాన్స్ భ‌గ్గుమంటున్నారు.

Also Read : Tom Moody

Leave A Reply

Your Email Id will not be published!