Tom Moody : ఆర్సీబీ కొంప ముంచిన గిల్ సిక్స‌ర్లు

హెడ్ కోచ్ టామ్ మూడీ కామెంట్స్

Tom Moody : బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో ఆర్సీబీ ఓటమి పాలు కావ‌డం ఆ జ‌ట్టును నిరాశ ప‌రిచింది. ప్ర‌ధానంగా బెంగళూరు ఆశ‌ల‌పై గుజ‌రాత్ స్టార్ బ్యాట‌ర్ శుభ్ మ‌న్ గిల్ నీళ్లు చ‌ల్లాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు. ప్ర‌ధానంగా బెంగ‌ళూరు బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు. చివ‌రి వ‌ర‌కు ఉన్నాడు. తానే భారీ సిక్స‌ర్ తో విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు.

దీంతో శుభ్ మ‌న్ గిల్ హీరోగా మారాడు. కానీ ఆర్సీబీ త‌ర‌పున విరాట్ కోహ్లీ అద్భుత‌మైన సెంచ‌రీ సాధించినా ఫ‌లితం లేకుండా పోయింది. ఈ సంద‌ర్భంగా బెంగ‌ళూరు ఓట‌మికి ప్రధాన కార‌ణం శుభ్ మ‌న్ గిల్ అని స్ప‌ష్టం చేశాడు హెడ్ కోచ్ టామ్ మోడీ(Tom Moody).

విరాట్ కోహ్లీకి , శుభ్ మ‌న్ గిల్ కు మ‌ధ్య ఉన్న తేడా ఏమిటో స్ప‌ష్టం చేశాడు. కోహ్లీ 61 బంతులు ఎదుర్కొని 101 ర‌న్స్ చేశాడు. ఐపీఎల్ లో 7 సెంచ‌రీలు చేసిన ఘ‌న‌త సాధించాడు. కానీ జ‌ట్టును గెలిపించ‌లేక పోయాడు. ఇక శుభ్ మ‌న్ గిల్ కేవ‌లం 52 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్నాడు. ఇందులో 5 ఫోర్లు 8 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. 104 ర‌న్స్ తో నాటౌట్ గా నిలిచాడు. మొత్తంగా చూస్తే ఆర్సీబీ ఓడి పోయేందుకు ప్ర‌ధాన కార‌ణం గిల్ కొట్టిన సిక్స‌రేన‌ని వాపోయాడు టామ్ మూడీ(Tom Moody).

Also Read : CSK vs GT Qualifier1

Leave A Reply

Your Email Id will not be published!