South Central Railway: వేసవి రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి 42 స్పెషల్ ట్రైన్స్

వేసవి రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి 42 స్పెషల్ ట్రైన్స్

South Central Railway : వేసవి రద్దీను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway)… రైలు ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల దృష్ట్యా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించినట్లు ప్రకటించింది. విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్‌ లోని పలు ప్రాంతాలకు, అలాగే కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు వీటిని నడపనున్నట్లు వెల్లడించింది. విశాఖ, బెంగళూరు, తిరుపతి, కర్నూలు ప్రాంతాల మధ్య మొత్తం 42 వీక్లీ రైళ్లను నడిపేందుకు సిద్ధమైనట్లు తెలిపింది. విశాఖ-బెంగళూరు, విశాఖపట్నం- తిరుపతి, విశాఖపట్నం- కర్నూలు సిటీ మధ్య మొత్తం 42 వేసవి వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 13 నుంచి మే నెలాఖరు వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.

South Central Railway – విశాఖపట్నం- బెంగళూరుకు 14 రైళ్ళు

విశాఖ-బెంగళూరు మధ్య 14 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారి తెలిపారు. విశాఖ- బెంగళూరు రైలు ఆదివారం రోజున విశాఖపట్నం నుంచి తిరుగు ప్రయాణం సోమవారం రోజున బెంగళూరు నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ రైలు ఏలూరు, విజయవాడ, ఒంగోలు, దువ్వాడ, గూడురు, రేణిగుంట, జోలార్‌పేట్‌, కుప్పం, బంగారుపేట, కృష్ణరాజపురం, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుందని చెప్పారు. అలాగే వీటిల్లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌, జనరల్‌ కోచ్‌లు ఉంటాయని వెల్లడించారు. 08581, 08582 నంబర్ గల రైళ్లు ఆయా స్టేషన్లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ రైళ్ళలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌, జనరల్‌ కోచ్‌ లు ఉంటాయి.

విశాఖపట్నం- తిరుపతి 14 రైళ్ళు

విశాఖ- తిరుపతి మధ్య 14 రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. అయితే విశాఖపట్నం- తిరుపతి(Tirupati) రైలు ప్రతి బుధవారం విశాఖ నుంచి తిరుగు ప్రయాణం గురువారం రోజున తిరుపతి నుంచి ఉంటుందని వెల్లడించారు. 08548, 08547 నంబర్ల గల రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇవి నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్‌, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట, కైకలూరు, గుడివాడ, దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.

విశాఖ-కర్నూలు సిటీకు 14 రైళ్ళు

విశాఖ-కర్నూలు సిటీ మధ్య మెుత్తం 14 రైళ్లు తిరుగుతాయని అధికారులు వెల్లడించారు. విశాఖ-కర్నూలు ప్రత్యేక రైలు విషయానికి వస్తే ప్రతి మంగళవారం రోజున విశాఖ నుంచి కర్నూలు సిటీకి అలాగే తిరుగు ప్రయాణం బుధవారం రోజున కర్నూలు నుంచి విశాఖకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. 08545, 08546 నంబర్ గల రైళ్లు విశాఖ-కర్నూలు మధ్య తిరుగుతాయని పేర్కొన్నారు. వినుకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు, దువ్వాడ, నరసరావుపేట, దిగువమెట్ట, నంద్యాల, డోన్‌, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు సేషన్లలో రైళ్లు ఆగుతాయని వెల్లడించారు. మరోవైపు వీటిల్లోనూ 2ఏసీ, 3ఏసీ, జనరల్‌ కోచ్‌లు ఉంటాయని తెలిపారు. రైళ్ల తేదీలు వెల్లడించినప్పటికీ, ఏ సమయానికి బయలుదేరుతాయనే విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ఇంకా ప్రకటించలేదు.

Also Read : MLC Vijaya Shanthi: ఎమ్మెల్సీ విజయశాంతి కుటుంబానికి బెదిరింపులు !

Leave A Reply

Your Email Id will not be published!