SP Amit Bardar: మావోల ఎన్ కౌంటర్ పై కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ అమిత్ బర్దార్
మావోల ఎన్ కౌంటర్ పై కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ అమిత్ బర్దార్
SP Amit Bardar : మావోయిస్ట్ కీలక నేతలు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, వెంకట రవి చైతన్య అలియాస్ అరుణ, అంజు అలియాస్ మాసే… ఈ ముగ్గురు అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం కింటుకూర అటవీ ప్రాంతంలో జరిగిన పోలీస్ కాల్పుల్లో బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్ కౌంటర్ పై గాజర్ల రవి సోదరుడు మాజీ మావోయిస్ట్ (Maoists) అనుమానాలు వ్యక్తం చేసారు. ఎన్ కౌంటర్ ప్రాంతం నుండి స్వాధీనం చేసుకున్న మృతదేహాలను రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ మృతుల బంధువులను అనుమతించలేదు. దీనితో తన తమ్ముడు మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.
SP Amit Bardar Key Comments
ఈ నేపథ్యంలో ఎన్ కౌంటర్ ఘటనపై అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ (SP Amit Bardar) వివరాలు వెల్లడించారు. విశాఖపట్నంలోని కైలాసగిరి రూరల్ పోలీస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ… విశ్వసనీయ సమాచారంతో కింటుకూర అటవీ ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. ఆ సమయంలో పోలీసుల భద్రతా బలగాల మీద మావోయిస్టులు కాల్పులు జరిపారని చెప్పారు.
తమ ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపామని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ (SP Amit Bardar) అన్నారు. మావోయిస్టు నేతలు గాజుల రవి అలియాస్ ఉదయ్, వెంకట రవి చైతన్య అలియాస్ అరుణ, అంజు అలియాస్ మాసే.. ఈ ముగ్గురు పోలీస్ కాల్పుల్లో మృతి చెందారని తెలిపారు. గాజుల రవి మీద సుమారు 150 కేసులున్నాయని.. రూ. 25 లక్షల రివార్డు ఉందని వెల్లడించారు. అరుణ మీద కూడా 150 కేసులు ఉన్నాయని.. రూ. 20 లక్షల రివార్డు ఉందని, అంజు మీద 22 కేసులు ఉన్నాయి, లక్ష రూపాయలు రివార్డు ఉందని తెలిపారు. ఈ సంఘటన ప్రాంతంలో మూడు ఏకే 47 తుపాకులు, కిట్ బ్యాగులు, తూటాలు మావో సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
ఈ ముగ్గురు మావోయిస్టులు కూడా కొద్దీ రోజుల క్రితం వై రామవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్నారని ఎస్పీ అమిత్ బర్దార్ అన్నారు. అరకు శాసనసభ్యులు సర్వేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు సోమ హత్య కేసు, అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పేలుళ్లు, బలిమెల ఘటనలో కూడా ఈ మావోల పాత్ర ఉందని గుర్తుచేశారు. ఈ సంఘటన మీద 65/ 225 కేసు నమోదు చేశామని చెప్పారు. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఆన్ డ్యూటీ ప్రక్రియ అని వివరించారు. ఏపీ భూభాగంలో ఈ ఘటన జరిగిందని అన్నారు. మావోలు శాంతిభద్రతల దృష్ట్యా జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని సూచించారు. సాధారణంగా మావోల విషయంలో వారు లొంగిపోవాలని ముందుగా తాము కోరుతామని చెప్పారు. గతంలో కంటే ప్రస్తుతం మావోల సంఖ్య గణనీయంగా తగ్గిందని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ వెల్లడించారు.
Also Read : Pawan Kalyan: ఫాస్టాగ్ వార్షిక పాస్ పై పవన్ కల్యాణ్ ప్రశంసల జల్లు
