Speaker Disqualified MLC: ఫిరాయింపు ఎమ్మెల్సీలపై శాసన మండలి చైర్మన్‌ అనర్హత వేటు !

ఫిరాయింపు ఎమ్మెల్సీలపై శాసన మండలి చైర్మన్‌ అనర్హత వేటు !

Speaker Disqualified MLC: ఆంధ్రప్రదేశ్‌ లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్‌, సి. రామచంద్రయ్యలపై వేటు వేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ప్రకటించారు. వైసీపీ తరఫున ఈ ఇద్దరు ఎమ్మెల్సీలుగా ఎన్నికవగా… ఇటీవల వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన పార్టీలో, సి. రామచంద్రయ్య టీడీపీలో(TDP) చేరారు. దీనితో పార్టీ ఫిరాయింపుల కింద ఈ ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి వైసీపీ నేత, మండలిలో చీఫ్‌ విప్‌ మేరుగ మురళీధర్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు ఫిర్యాదు చేశారు.

Speaker Disqualified MLC Updates

ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ.. మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ఆ ఇద్దరికి నోటీసులు పంపించారు. నోటీసుల ఆధారంగా వాళ్లిద్దరి నుంచి వివరణ సైతం తీసుకున్నారు మండలి చైర్మన్‌ మోషేన్ రాజు. ఈ క్రమంలో సమగ్ర విచారణ అనంతరమే ఆ ఇద్దరిపై వేటు వేసినట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు మంగళవారం ప్రకటించారు.

Also Read : Bhatti Vikramarka: సోషల్ మీడియా ట్రోల్స్ పై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి !

Leave A Reply

Your Email Id will not be published!