Justice Yashwant Varma: జస్టిస్‌ వర్మపై అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన స్పీకర్‌

జస్టిస్‌ వర్మపై అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన స్పీకర్‌

Justice Yashwant Varma : అగ్నిప్రమాదంలో ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ (Justice Yashwant Varma) ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయన అభిశంసన తీర్మానాన్ని తాజాగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్వీకరించారు. ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్‌ కుమార్‌, మద్రాస్ హైకోర్టు సీజే జస్టిస్‌ మణీందర్‌ మోహన్‌, సీనియర్‌ న్యాయవాది బీవీ ఆచార్యలు ఈ ప్యానెల్‌లో సభ్యులుగా ఉన్నారు.

Justice Yashwant Varma Case Updates

అభిశంసనపై 146 మంది ఎంపీలు సంతకాలు చేయగా… దాన్ని స్పీకర్‌ ఓం బిర్లా స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కమిటీ తన నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని కోరారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో పార్లమెంటు ఐక్యంగా ఉంటుందన్నారు. స్పీకర్‌ ఏర్పాటు చేసిన కమిటీకి ఘటనకు సంబంధించి సాక్షులను పిలిచి ప్రశ్నించే అధికారం కూడా ఉంటుంది. నివేదికను తొలుత స్పీకర్‌కు సమర్పిస్తారు. ఆ తర్వాత సభలో ప్రవేశపెట్టి దానిపై ఓటింగ్ నిర్వహిస్తారు.

దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంటి ఆవరణలో కాలిపోయిన నోట్ల కట్టలు దొరికాయి. మంటలను ఆర్పేందుకు వచ్చిన సిబ్బంది వాటిని గుర్తించారు. ఈ ఘటనపై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా… అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ నోట్ల కట్టలు దొరికింది వాస్తవమేనని తేల్చింది. ఆ నివేదికను జస్టిస్ వర్మ సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా… అక్కడ ఆయనకు చుక్కెదురైంది.

Also Read : Supreme Court: వీధి కుక్కల సమస్యపై సుప్రీం తీర్పును ఆక్షేపిస్తున్న ప్రముఖులు

Leave A Reply

Your Email Id will not be published!