CJI Chandrachud : ఐటీ కేసుల విచార‌ణ‌కు ప్ర‌త్యేక బెంచ్ – సీజేఐ

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్

CJI Chandrachud : దేశ వ్యాప్తంగా ల‌క్ష‌లాదిగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిని సాధ్య‌మైనంత ప‌రిష్క‌రించాలంటే చాలా స‌మ‌యం ప‌డుతుంది. ద‌శ‌ల వారీగా ప్రాధాన్యాత క్ర‌మంలో కేసుల‌ను ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు భార‌త దేశ సర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్.

బుధ‌వారం కీల‌క వ్యాఖ్య‌లుచేశారు సీజేఐ. ఐటీ (ప‌న్ను) కేసుల విచార‌ణ‌కు సంబంధించి వ‌చ్చే వారం నుంచి సుప్రీంకోర్టు ప్ర‌త్యేక బెంచ్ ఏర్పాటు చేయ‌నుంద‌న్నారు. న్యాయ వ్య‌వ‌స్థ‌లో ఇదో కీల‌క‌మైన సంస్క‌ర‌ణ‌గా ఆయ‌న పేర్కొన్నారు.

ఇందులో భాగంగా ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష అమ్మ‌క‌క‌పు న్ను వ్య‌వ‌హారాల‌ను ప‌రిష్క‌రించేందుకు గాను వారంలో ప్ర‌తి బుధ‌, శుక్ర‌వారాల్లో ప్ర‌త్యేక బెంచ్ ఉంటుంద‌ని సీజేఐ చంద్ర‌చూడ్(CJI Chandrachud)  స్ప‌ష్టం చేశారు. త‌న కోర్టు హాలులో హాజ‌రైన న్యాయ‌వాదుల బృందానికి విచార‌ణ తేదీలోను కోరుతూ చెప్పారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుత సీజేఐ న‌వంబ‌ర్ 9న ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న కీల‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టారు. వ‌స్తూనే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. న్యాయం అన్న‌ది ధ‌న‌వంతుల‌కు కాద‌ని సామాన్యుల కోస‌మ‌ని పేర్కొన్నారు. జ‌స్టిస్ చంద్ర‌చూడ్ ఆధునిక భావాలు క‌లిగిన న్యాయ‌మూర్తిగా పేరు పొందారు.

ప‌లు సంచ‌ల‌న తీర్పులు ఇచ్చిన ఘ‌న‌త కూడా ఆయ‌న‌దే కావ‌డం విశేషం. కాగా 2015లో మాజీ సీజేఐ జ‌స్టిస్ ద‌త్తు అప్ప‌ట్లో ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష ప‌న్నుల‌కు సంబంధించిన కేసుల‌కు ప్ర‌త్యేక బెంచ్ లు ఏర్పాటు చేశారు. ఆ త‌ర్వాత అంటే ఏడేళ్ల త‌ర్వాత తిరిగి సీజేఐ చంద్ర‌చూడ్ నిర్ణ‌యం తీసుకున్నారు.

Also Read : లెఫ్టినెంట్ గ‌వ‌ర్నర్ అధికారాల‌పై ఆరా

Leave A Reply

Your Email Id will not be published!