Special Investigation Team: తిరుమల లడ్డూ వివాదంపై సర్వ శ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ !
తిరుమల లడ్డూ వివాదంపై సర్వ శ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ !
Special Investigation: తిరుమలలో కొలువు తీరిన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన ఘటనపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కల్తీ నెయ్యి వినియోగంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న సర్వ శ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సెట్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ డీఐజీగా విశాఖ రేంజ్‌లో పనిచేసిన గోపీనాథ్ జెట్టిని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నియమించారు. సిట్ ఎస్పీగా కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును నియమించారు. ఈ సిట్(SIT) టీమ్‌లో మరి కొంతమంది డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలను ఏపీ ప్రభుత్వం నియమించనుంది.
Special Investigation Team for Tirumala
మరోవైపు లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు సీబీఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై ఎంపీ సుబ్రమణ్యంస్వామి సహా పలువురు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ఎన్‌డీడీబీ ఇచ్చిన నివేదికతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన నిజనిజాలు వెలుగులోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా చంద్రబాబు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ ఘోర అపచారం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం.. సోమవారం శాంతి హోమం నిర్వహించింది. అనంతరం శ్రీవారు కొలువు దీరిన ఆనంద నిలయంతోపాటు తిరుమాడ వీధుల్లో తిరుమల పూజారులు సంప్రోక్షణ నిర్వహించారు.
Also Read : Minister Seethakka: గవర్నర్ తో మంత్రి సీతక్క భేటీ ! కీలక బిల్లులు ఆమోదించాలని విజ్ఞప్తి !