Special Train : కర్ణాటక పుణ్యక్షేత్రాల సందర్శనకు డిసెంబర్ నుంచి ప్రత్యేక రైళ్లు
కర్ణాటక పుణ్యక్షేత్రాల సందర్శనకు డిసెంబర్ నుంచి ప్రత్యేక రైళ్లు..
Special Train : కర్ణాటకలోని పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు డిసెంబర్ 5న భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్‌ను ఏర్పాటు చేసినట్లు టూర్ టైమ్స్ రీజనల్ మేనేజర్ రమేష్ అయ్యంగార్, సౌత్‌స్టార్ రైల్ ప్రొటెక్ట్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే టూర్ పోస్టర్‌ను ఆవిష్కరించి వారు మాట్లాడారు. మార్గశిర మాసం సందర్భంగా నవ బృందావనం, గోకర్ణ, మురుడేశ్వర్, కొల్లూరు, శృంగేరి, హోంనాడు, ధర్మస్థల, కుకి సుబ్రహ్మణ్య, మైసూర్, శ్రీరంగపట్నం, మేల్కోటేలను సందర్శించడానికి 9 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.
Special Train in Karnataka
ఈ టూర్‌కు 33 శాతం రాయితీ పొందవచ్చని, సీనియర్ సిటిజన్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 5న చెన్నైలో బయల్దేరనున్న ఈ ట్రైన్ ఏపీలోని గూడూరు, నెల్లూరు, ఓంగోలు, చీరాల.. తెలంగాణలోని మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్‌లలో ఆగుతుందన్నారు. పూర్తి వివరాలకు 9355021516 నంబర్లో సంప్రదించాలని కోరారు.
Also Read : Sajjala Ramakrishna Reddy : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల కు షాక్