Padmanabhaswamy Temple: పద్మనాభస్వామి ఆలయంలోకి రహస్య కెమెరాతో భక్తుడు
పద్మనాభస్వామి ఆలయంలోకి రహస్య కెమెరాతో భక్తుడు
Padmanabhaswamy Temple : కేరళ లోని ప్రఖ్యాత అనంత పద్మనాభస్వామి ఆలయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రహస్య కెమెరాతో ఓ వ్యక్తి దేవాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. దీన్ని గమనించిన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Padmanabhaswamy Temple – Devotee with Spy Camera
భద్రత దృష్ట్యా పద్మనాభస్వామి ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. కానీ, గుజరాత్‌కు చెందిన సురేంద్ర షా (66) ఆ భద్రతా నియమాలను ఉల్లంఘించాడు. రహస్య కెమెరాను అమర్చిన తన స్మార్ట్ గ్లాసెస్ తో ఆలయంలోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. అతడి గ్లాసెస్ నుంచి కాంతి రావడాన్ని భద్రతా సిబ్బంది గుర్తించి తనిఖీలు చేయగా.. రహస్య కెమెరా విషయం బయటపడింది. దీనితో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
Also Read : IMD: వాతావరణ అంచనాల కోసం 1,800 కోట్లతో మరో రెండు ఉపగ్రహాలు – ఐఎండీ
