Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

Sravan Rao : ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల్లో ఒకరైన శ్రవణ్ రావుపై సీసీఎస్‌ లో మరో కేసు నమోదు అయింది. దీనితో అతడిని పోలీసులు విచారణకు పిలిచారు. ఈ క్రమంలో మంగళవారం అతడు పోలీసుల విచారణకు హాజరయ్యారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. గతంలో ఓ సంస్థకు శ్రవణ్ రావు… దాదాపు రూ. 6 కోట్లు మేర మోసం చేసినట్లు బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులోని న్యాయమూర్తి ఎదుట అతడిని హాజరుపరచాలని నిర్ణయించారు.

Sravan Rao Arrest on Cheating Case

గతంలో అఖండ ఎంటర్ ప్రైజస్ సంస్థను రూ. 6 కోట్ల మేర మోసం చేసినట్లు శ్రవణ్‌ రావుపై ఆరోపణలున్నాయి. ఈ మేరకు బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులోని న్యాయమూర్తి ఎదుట అతడిని హాజరుపరిచాలని నిర్ణయించారు. అందుకోసం అతడిని న్యాయమూర్తి ఇంటికి తరలించారు.

Also Read : PM Narendra Modi: ఆదంపుర్‌ ఎయిర్‌ బేస్‌ ను సందర్శించిన ప్రధాని మోదీ

Leave A Reply

Your Email Id will not be published!