Sreesanth : కేరళ – మాజీ క్రికెటర్ శ్రీశాంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో కేరళ స్టార్ క్రికెటర్ , రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ ను బీసీసీఐ పక్కన పెట్టడాన్ని సమర్థించాడు. మరో వైపు కావాలనే శాంసన్ ను పక్కన పెట్టిందని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్వలు వెల్లువెత్తుతున్నాయి.
Sreesanth Comments on Sanju Samson
ఈ తరుణంలో అటు అభిమానులు ఇటు మాజీ క్రికెటర్లు సైతం సంజూ శాంసన్ ను వరల్డ్ కప్ కు ఎంపిక చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ప్రత్యేకించి మాజీ భారత క్రికెట్ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ , మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే మాజీ స్పిన్నర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత జట్టు సమతూకంగా ఉందని , కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ గా సరి పోతారని ఇక శాంసన్ ను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారని ప్రశ్నించాడు.
ఇదిలా ఉండగా కేరళ మాజీ క్రికెటర్ శ్రీాశాంత్(Sreesanth) మాత్రం ఆసక్తికర కామెంట్స్ చేశాడు సంజూ శాంసన్ పై . సంజూకు కొంచెం పొగరు ఎక్కువని ఆరోపించాడు. ఆయన చేసిన కామెంట్స్ కలకకం రేపుతున్నాయి.
Also Read : Perni Nani : పదవి కోసం మామా అల్లుళ్ల పోరాటం