Sri Lanka Crisis : లంక‌లో మిన్నంటిన నిర‌స‌న ఒక‌రు మృతి

క‌నిపిస్తే కాల్చివేతకు తాత్కాలిక చీఫ్ ఆదేశం

Sri Lanka Crisis : శ్రీ‌లంక‌లో సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. ప్రెసిడెంట్, ప్ర‌ధాని తమ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు ఆందోళ‌న‌కారులు.

ఇప్ప‌టికే గోట‌బ‌య రాజ‌ప‌క్సే రాజ భ‌వ‌నాన్ని ముట్ట‌డించారు. అక్క‌డే తిష్ట వేశారు. మ‌రో వైపు ప్ర‌ధాని విక్ర‌మ సింఘే ఇంటికి నిప్పంటించి వాహ‌నాలు ధ్వంసం చేశారు. ఇదే స‌మ‌యంలో ప్రెసిడెంట్ మాల్దీవుల‌కు ఆర్మీ స‌హ‌కారంతో పారి పోయాడు.

మ‌రో సోద‌రుడు మ‌హీంద రాజ‌ప‌క్సే నేవీ, ఆర్మీ క్యాంపులో త‌ల‌దాచుకున్నాడు. సుప్రీంకోర్టు అత‌డిని దేశం విడిచి వెళ్ల‌వ‌ద్దంటూ ఆదేశించింది. ప్ర‌ధానిగా ఉన్న ర‌ణిలేను తాత్కాలిక దేశ అధ్య‌క్షుడిగా నియ‌మించారు స్పీక‌ర్.

ఇందుకు విప‌క్షాలు కూడా స‌మ్మ‌తించాయి. కానీ ప్ర‌జ‌లు మాత్రం ఒప్పు కోవ‌డం లేదు. కొలంబోలోని ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం వెలుప‌ల పెద్ద ఎత్తున జ‌నం నిర‌స‌న‌కు దిగారు.

వారిని చెద‌ర‌గొట్టేందుకు టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించాయి బ‌ల‌గాలు. 26 ఏళ్ల యువ‌కుడు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది ప‌డ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డంతో మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం.

దీంతో మ‌రింత ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి దేశ రాజ‌ధాని కొలంబోలో(Sri Lanka Crisis). తాత్కాలిక అధ్య‌క్షుడు దేశ మంతటా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి (ఎమ‌ర్జెన్సీ)ని విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు దారి తీసేలా చేసింది.

ఇది ప్ర‌జాస్వామ్యానికి మంచిది కాదంటూ నిప్పులు చెరిగారు మాజీ క్రికెట‌ర్ స‌న‌త్ జ‌య‌సూర్య‌. పాల‌కులు ప్ర‌జా విశ్వాసాన్ని కోల్పోయార‌ని ఆరోపించారు.

నిర‌స‌న‌కారులు భ‌ద్ర‌తా వ‌ల‌యాన్ని ధిక్క‌రించారు. కొన్ని గంట‌ల క్రితం విక్ర‌మ సింఘే ఆఫీసులోకి ప్ర‌వేశించారు. భ‌వ‌నంపై జాతీయ జెండాల‌ను ఎగుర వేశారు.

Also Read : పాల‌కులు కారు ప్ర‌జా కంఠ‌కులు – స‌న‌త్

Leave A Reply

Your Email Id will not be published!