Sri Lankan President : భారత్ సహకారం శ్రీలంకకు అవసరం
దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే
Sri Lankan President : శ్రీలంక అధ్యక్షుడు రిణిల్ విక్రమ సింఘే కీలక వ్యాఖ్యలు చేశారు. విధాన పరమైన సంస్కరణలు, పాలనలో భారత దేశం సహాయం అత్యంత అవసరమని స్పష్టం చేశారు. సామాజిక ఆర్థిక అభివృద్దిని భారత దేశం నిర్వహిస్తున్న తీరును ఆయన మెచ్చుకున్నారు.
ఇందులో భాగంగా శ్రీలంకకు భారత్ నుంచి ప్రధానంగా విధాన సంస్కరణలు, పాలన, సామర్థ్యం పెంపుదల, డిజిటలైజేషన్ , పబ్లిక్ సర్వీస్ డెలివరీని స్థాపించడంలో శ్రీలంకకు(Sri Lankan President) సాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని భారత సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు , పెన్షన్ల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
నేషనల్ సెంటర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్సీజీజీ) డైరెక్టర్ జనరల్ భరత్ లాల్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం శ్రీలంక అధ్యక్షుడు రణిలె విక్రమసింఘెను కలుసుకుంది. శ్రీలంక దేశ అధ్యక్షుడి అభ్యర్థన మేరకు భారత దేశం అన్ని రంగాలలో , అన్ని అంశాలలో సహాయ సహకారాలు అందజేసేందుకు సిద్దంగా ఉందని హామీ ఇచ్చారు.
శ్రీలంకలో యూనివర్శిటీ ఆఫ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీని స్థాపించడంలో ఎన్సీజీజీ సాయం చేయాలని కోరారు రణిలె విక్రమసింఘె. పారదర్శకత, జవాబుదారీతనం , సమ్మిళితతపై దృష్టి సారించే సుపరిపాలన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చర్యలను ప్రశంసించారు శ్రీలంక ప్రెసిడెంట్.
Also Read : 11 స్థలాలకు చైనా కొత్త పేర్లు