#SSRajamouli : రాజ‌మౌళి ప్యాన్ ఇండియా డైరెక్ట‌ర్

అంద‌రి దృష్టి ఆర్ఆర్ఆర్ మూవీ పైనే

SS Rajamouli : భారతీయ సినిమా జగత్తులో ధ్రువతారగా వెలుగొందేలా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఎస్.ఎస్.రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమాకు హాలీవుడ్ స్థాయిలో పేరు తీసుకు వచ్చిన అరుదైన డైరెక్టర్. ఎన్నో అవార్డులు, పురస్కారాలు, ప్రశంసలు వచ్చినా ఎలాంటి పబ్లిసిటీ కోరుకోకుండా పూర్తిగా తన లోకంలో తాను వుండి పోతాడు. ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం వుండి తీరుతుంది.

ఉన్న డైరెక్టర్స్ లలో ఇప్పుడు టాప్ వన్ దర్శకుడిగా కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తున్నారు. ప్రభాస్ తో తీసిన బాహుబలి సినిమా కోట్లాది రూపాయలను కొల్లగొట్టింది. ఇండియాలో, వరల్డ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో ఈ ఒక్క సినిమాతో తెలుగు సినిమా రంగానికి ఎనలేని కీర్తిని తీసుకు వచ్చాడు రాజమౌళి(SS Rajamouli ). కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూర్ లో 1973 అక్టోబరు 10 న పుట్టారు.

సినిమా దర్శకుడిగా, నిర్మాతగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు ఆయన. ఒక్కో సినిమాకు ఎస్. ఎస్. రాజమౌళి దాదాపు 12 కోట్ల రూపాయలకు పైగానే తీసుకుంటారన్న టాక్ ఉన్నది. జీవిత భాగస్వామి రామా రాజమౌళి. ఇద్దరు పిల్లలు. ఒకరు కార్తికేయ మరొకరు మయూష. భార్య రామా రాజమౌళి మంచి డిజైనర్. అన్ని సినిమాలకు ఆమె డ్రెస్సెస్ డిజైన్ చేస్తుంది. రాజమౌళి తండ్రి కె. వి. విజయేంద్ర ప్రసాద్. ఆయన ఫాదర్ కథా రచయితగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు.

అయితే రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ ధారా వాహికలకు పని చేసాడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడక పోవడం ఇతని ప్రత్యేకత. జూనియర్ ఎన్ఠీఆర్ రాజమౌళి తీసిన మూడు చిత్రాలు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి.

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇతనికి అన్నయ్య అవుతాడు. తన ప్రతి చిత్రంలో చిత్ర విచిత్రమైన ఆయుధాలను నాయకుని చేత ధరింప జేస్తాడు. రాజమౌళి(SS Rajamouli )తీసిన బాహుబలి, బాహుబలి ది కంక్లూజన్ సినిమాలు సినీ రంగాన్ని ఒక ఊపు ఊపాయి. వసూళ్లలో సునామి సృష్టించాయి. ప్రభాస్ ను పాన్ ఇండియా హీరో గా నిలబెట్టాయి. తెలుగు సినిమాలో ఏ సినిమా సాధించని వసూళ్లను రాబట్టింది. ఏకంగా1800 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది.

స్టూడెంట్ నంబర్ వన్, సై , ఛత్రపతి, విక్రమార్కుడు, సింహాద్రి, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, రాజన్న, ఈగ, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు తీశాడు. అన్ని సినిమాలు ఒక ఎత్తు. బాహుబలి(SS Rajamouli )సినిమా ఒక ఎత్తు. పద్మశ్రీ అందుకున్నారు. పూర్తిగా సినిమానే లోకంగా ..జీవితంగా భావిస్తూ సాగిపోతున్న ఎస్.ఎస్.రాజమౌళి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం. ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ మూవీపైనే భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన టీజ‌ర్ల‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇందులో రామ్ చ‌ర‌ణ్, జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

No comment allowed please