Statue Of Equality : సర్వ ప్రాణులన్నీ ఒక్కటే. సమస్త మానవులంతా ఒక్కటే. ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రాణికి బతికే హక్కుంది. వెయ్యేళ్ల కిందట మనుషుల మధ్య అంతరాలు ఉండరాదని, దైవం అందరికీ సమానమేనని పిలుపునిచ్చిన మహానుభావుడు శ్రీ రామానుజుడు.
వెయ్యేళ్ల అనంతరం ముచ్చింతల్ లోని సమతా కేంద్రంలో(Statue Of Equality) ఏర్పాటు చేసిన భారీ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రూ. 1000 కోట్ల ఖర్చుతో 216 అడుగులతో నిర్మించిన రామాజుడు విగ్రహాన్ని, సమతా కేంద్రాన్ని భారత జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు మోదీ.
ఇది దేశం గర్వించ దగిన సన్నివేశం. ప్రతి ఒక్కరూ సమతామూర్తి(Statue Of Equality) స్పూర్తిని అంది పుచ్చుకోవాలి. ఆయన చూపిన మార్గం ఈ దేశానికి అవసరమన్నారు. అంధ విశ్వాసాలు మనుషుల్ని వెనక్కి నెట్టి వేస్తాయి.
ఏది మంచి ఏది చెడు అన్న తర్కానికి తెర తీసిన వ్యక్తి ఆయన. భక్తికి కులం, మతం ఎందుకని ప్రశ్నించాడు. శ్రీరంగం, తిరుమల ఆయన చలవనేని గుర్తించాలి. ఆనాటి సమాజంలో పక్కన ఉంచిన దళితులకు ఆలయ ప్రవేశం చేయించాడు.
వేదాలు, ఉపషనిత్తుల సారం గ్రంథాలలో ఉంటే సరికాదని అది ప్రతి ఒక్కరికీ అందితేనే సార్థకత చేకూరుతుందని చాటాడు శ్రీ రామానుజుడు. తెలివి కలిగిన ప్రతి ఒక్కరు బ్రాహ్మణుడేనని చాటిన మహనీయుడు ఈ సమతా మూర్తి.
కుల, మతాలు మనుషుల మధ్య అంతరాలు పెంచేలా చేస్తాయి. అంతా ఒక్కటేనన్న భావన లేక పోతే బతకడం కష్టమన్నారు ప్రధాని. శ్రీ రామానుజుల సమతా సూత్రం భారత రాజ్యాంగానికి స్పూర్తి అని పేర్కొన్నారు మోదీ.
Also Read : మోదీ కోసం సమతా కేంద్రం ముస్తాబు