Vivek Agnihotri : దుష్ప్రచారం ఆపండి వాళ్లను గౌరవించండి
ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి
Vivek Agnihotri : దేశ వ్యాప్తంగా ది కశ్మీర్ ఫైల్స్ సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. 100 కోట్ల మార్క్ ను ఎప్పుడో దాటేసింది. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మూవీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారి పోయారు.
ఆయనే స్వయంగా ఈ సినిమా వాస్తవాలను ప్రతిబంబించిందంటూ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ను ప్రత్యేకంగా అభినందించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ సినిమాకు సంబంధించి వినోద పన్ను మినహాయింపు ఇచ్చాయి. ఇదంతా పక్కన పెడితే 1980 నాటి చివర్లో 1990 మొదట్లో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దారుణ మారణకాండ, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడులు తట్టుకోలేక కశ్మీరీ పండిట్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే దానిని తెరకెక్కించాడు ఫిల్మ్ మేకర్.
దీనిని వివేక్ అగ్ని హోత్రి (Vivek Agnihotri )తీశాడు. ఓ వైపు ప్రశంసలు మరో వైపు విమర్శలు వస్తుండడంతో డైరెక్టర్ స్పందించాడు. విచిత్రం ఏమిటంటే ఆయన సెన్సార్ బోర్డు సభ్యుడు కావడం. ఆయన తీసిన సినిమాకు క్లియర్ సర్టిఫికెట్ వచ్చిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ తరుణంలో దర్శకుడు తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించాడు. దయచేసి దుష్ప్రచారం చేయకండి అని కోరారు. పనిలో పనిగా ఆనాటు చోటు చేసుకున్న దారుణాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించాలని, వారిని గౌరవించాలని సూచించాడు.
ఇదిలా ఉండగా ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఫైర్ అయ్యాడు. ఇక శివసేన జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్ చేశాడు. సినిమాను కూడా రాజకీయంగా ఉపయోగించు కోవడంలో మోదీ తర్వాతే ఎవరైనా అని ఆరోపించాడు.
Also Read : ది కాశ్మీర్ ఫైల్స్ పై ఆజాద్ కామెంట్స్