Rajeev Chandrasekhar : సోష‌ల్ మీడియాపై కేంద్రం సీరియ‌స్

రూల్స్ పాటించ‌క పోతే క‌ఠిన చ‌ర్య‌లు

Rajeev Chandrasekhar : సామాజిక మాధ్య‌మాలకు మ‌రోసారి కేంద్రం ఝ‌ల‌క్ ఇచ్చింది. ప్ర‌భుత్వానికి సంబంధించి నియ‌మ నిబంధ‌న‌లు ఇప్ప‌టికే త‌మ ప్ర‌భుత్వం రూపొందించింద‌ని, వాటిని సోష‌ల్ మీడియాతో పాటు డిజిట‌ల్ మీడియా , ప్ర‌చురణ‌, ప్ర‌సార మాధ్య‌మాలు అన్నీ ఒకే ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ స్ప‌ష్టం చేశారు.

ప్ర‌ధానంగా హ‌ద్దు అదుపు లేకుండా అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు. ఫేక్ న్యూస్ లేదా ఇత‌ర అద‌న‌పు స‌మాచారాన్ని పోస్ట్ చేసినా లేదా వ్యాప్తి చేసినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

త‌ప్పు అని తేలితే పూర్తిగా నిషేధం విధిస్తామ‌ని హెచ్చ‌రించారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి. గూగుల్, మైక్రో సాఫ్ట్, ట్విట్ట‌ర్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్ , త‌దిత‌ర మాధ్య‌మాల‌న్నింటికీ ఇది వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్(Rajeev Chandrasekhar).

ఇప్ప‌టికే అన్ని సంస్థ‌ల‌కు అప్పిలేట్ క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశాలు జారీ చేశామ‌న్నారు. మ‌రో వైపు మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్ట‌ర్ ను టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలాన్ మ‌స్క్ టేకోవ‌ర్ చేయ‌డంపై కూడా స్పందించారు రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్.

టెస్లా అధిప‌తి అయినా లేదా ఇంకెవ‌రైనా స‌రే భార‌త ప్ర‌భుత్వ రూల్స్ కు క‌ట్టుబ‌డి ఉండాల్సిందేనంటూ మ‌రోసారి పేర్కొన్నారు ఐటీ మినిష్ట‌ర్.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఐటీ రూల్స్ లో మార్పులు చేస్తున్నామ‌ని మ‌రింత క‌ఠినంగా, క‌ట్టుదిట్టంగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశారు రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్.

Also Read : జ‌ర్న‌లిస్టుల‌ క్యాష్ గిప్ట్ ల క‌ల‌కలం

Leave A Reply

Your Email Id will not be published!