Sudarshan Reddy: జగన్ కు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్ధి సుదర్శన్ రెడ్డి ఫోన్
జగన్ కు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్ధి సుదర్శన్ రెడ్డి ఫోన్
Sudarshan Reddy : ఇండియా కూటమి తరుఫున ఉపరాష్ట్రప్రతి పదవికి పోటీ చేస్తున్న రిటైర్డ్ సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టీస్ సుదర్శన్‌రెడ్డి (Sudarshan Reddy) ఆదివారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో తనకు మద్దతు ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి కోరారు. దీనిపై వైయస్ జగన్ స్పందిస్తూ ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించడానికి ముందే తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఎన్డీఏ కోరిన విషయాన్ని గుర్తు చేశారు.
Sudarshan Reddy Call to YS Jagan
ఈ మేరకు వారికి మద్దతిస్తానని మాట కూడా ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. వ్యక్తిగతంగా జస్డీస్ సుదర్శన్‌రెడ్డి పట్ల అపారమైన గౌరవం ఉందని, ఆయన సేవలు దేశానికి అవసరమని వైయస్ జగన్ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య స్పూర్తిని కాపాడేందుకు ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. అయితే ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా ఆయనకు మద్దతు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇవ్వలేకపోతున్నందుకు అన్యధా భావించవద్దని విజ్ఞప్తి చేసారు.
Also Read : PM Narendra Modi: హైదరాబాద్ విమోచన దినోత్సవం ముందు ప్రధాని మోదీ సందేశం
