Sudershan Reddy: ఉపరాష్ట్రపతి కార్యాలయం రాజకీయ సంస్థ కాదు – జస్టిస్ సుదర్శన్ రెడ్డి
ఉపరాష్ట్రపతి కార్యాలయం రాజకీయ సంస్థ కాదు - జస్టిస్ సుదర్శన్ రెడ్డి
Sudershan Reddy : ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి (Sudershan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి కార్యాలయం రాజకీయ సంస్థ కాదని, అత్యున్నత రాజ్యాంగబద్ధ సంస్థ అని అన్నారు. గువాహటిలో విలేకరులతో మాట్లాడిన ఆయన… ఆ కార్యాలయంలో కూర్చునే వ్యక్తికి న్యాయమూర్తికి సమానమైన లక్షణాలు అవసరమని అభిప్రాయపడ్డారు.
Sudershan Reddy Key Comments
‘‘ఉపరాష్ట్రపతి కార్యాలయం కేవలం రాజకీయ సంస్థ కాదు. అక్కడ కూర్చునే వ్యక్తికి న్యాయమూర్తి లక్షణాలు అవసరం. నిష్పక్షపాతం, వివేకం, మాటలు, చేతల్లో న్యాయం వంటి లక్షణాలు ఉండాలి’’ అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఈసీపై మాట్లాడుతూ.. దేశంలో నిష్పక్షపాత, స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల సంఘానిదేనన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అర్హులైన ఏ ఒక్కరినీ తొలగించే ప్రయత్నాలు ఉండకూడదన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున ప్రస్తుతం తానేమీ మాట్లాడలేనన్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిలు తమ విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి మద్దతు కూడగడుతున్నారు. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది రాజకీయ పార్టీలు కాదని.. గౌరవ పార్లమెంటు సభ్యులతో కూడుకున్న ఎలక్టోరల్ కాలేజీ అని చెప్పారు. విచక్షణా శక్తిని వినియోగించి ఓటేయాలంటూ ప్రతి ఒక్క ఎంపీకీ లిఖితపూర్వక అభ్యర్థన చేసినట్లు ఇటీవల చెప్పారు.
Also Read : Air India: ‘పాన్-పాన్’ సిగ్నల్ తో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
