Sugavasi Balasubramaniam: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సుగవాసి బాల సుబ్రమణ్యం
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సుగవాసి బాల సుబ్రమణ్యం
Sugavasi Balasubramaniam : అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాల సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం… నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన సుగవాసి కుటుంబం టీడీపీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక ఆ పార్టీని వీడి వైఎస్ జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు.
Sugavasi Balasubramaniam Joined in YCP
సుగవాసి పాలకొండ్రాయుడి రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం (Sugavasi Balasubramaniam) 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2000లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పని చేశారు. 2001లో మరోసారి రాయచోటి జడ్పీటీసీగా గెలిచారు. 2012లో జరిగిన రాయచోటి ఉప ఎన్నికలో టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఆయన ఓడిపోయారు. 2024లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయిన సుగవాసి పాలకొండ్రాయుడు పెద్దకుమారుడే సుబ్రహ్మణం.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్.వి.సతీష్‌కుమార్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, రమేష్ కుమార్ రెడ్డి, ఎన్.శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read : Mudundi Ramakrishna Raju: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఎంఆర్ రాజు కన్నుమూత
