Stock Trading Scam: వేల కోట్ల ట్రేడింగ్ స్కామ్ లో ప్రముఖ నటి అరెస్టు !

వేల కోట్ల ట్రేడింగ్ స్కామ్ లో ప్రముఖ నటి అరెస్టు !

Stock Trading Scam: అస్సాంలో కలకలం సృష్టించిన ఆన్‌లైన్ స్టాక్‌ ట్రేడింగ్‌ స్కామ్‌ లో ప్రముఖ నటిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్ నటి సుమిబోరా(Sumi Borah), ఆమె భర్త తార్కిక్ బోరాను అదుపులోకి తీసుకుందని పోలీసులు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ కేసులో వీరిపై ఇప్పటికే లుకౌట్‌ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో తాజాగా వారి అరెస్టు చోటుచేసుకుంది.

Stock Trading Scam…

అస్సాం పోలీసులు ఇటీవల రూ.2 వేల కోట్ల కుంభకోణం గుట్టు రట్టు చేశారు. పెట్టుబడిని రెట్టింపు చేస్తామంటూ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్ల పేరిట ప్రజల నుంచి మోసగాళ్లు సొమ్మును సమీకరించారు. ఈ కేసులో ఇప్పటికే విశాల్ ఫుకాన్‌ ను అరెస్టు చేశారు. 60 రోజుల్లో పెట్టుబడులపై 30 శాతం రాబడి వస్తుందని విశాల్‌ నమ్మబలికాడు. నాలుగు నకిలీ సంస్థలను స్థాపించి, అస్సాం చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాడు. పలు ఆస్తుల్ని కూడబెట్టాడు. ఈ కుంభకోణంలో బోరా దంపతులతో పాటు మరికొందరిపైనా ఆరోపణలు వచ్చాయి. అతడి అరెస్టు తర్వాతే వీరిని పోలీసులు విచారణకు పిలిచారు. అయితే వీరు హాజరుకాకపోవడంతో లుకౌట్‌ నోటీసులు జారీ చేసి, తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

బుధవారం సుమిబోరా(Sumi Borah) ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘పరువుకు నష్టం కలిగించేలా నా కుటుంబంపై వార్తలు వస్తోన్న నేపథ్యంలో నేను పోలీసుల ముందు లొంగిపోవాలని, విచారణకు సహకరించాలని నిర్ణయించుకున్నాను. నేను ఎక్కడికీ పారిపోలేదు. మీడియాలో వస్తోన్న కథనాలతో మాకు ఎదురైన వేధింపుల వల్ల మేం పబ్లిక్‌ కు దూరంగా ఉన్నాం. ఆ వార్తల్లో 10 శాతం కూడా వాస్తవం లేదు’’ అని వెల్లడించారు. ఆమె లొంగిపోతానని చెప్పిన మరుసటి రోజే… పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. తొలుత మీడియా కథనాల్లో ఈ స్కామ్‌ విలువ రూ. 22 వేల కోట్లు అని రాగా… తర్వాత ఆ మొత్తం రూ. 2 వేల కోట్లుగా పేర్కొన్నాయి.

Also Read : Karnataka News : కర్ణాటకలోని మాండ్య జిల్లాలో మత ఘర్షణలకు తీవ్రకళకలం

Leave A Reply

Your Email Id will not be published!