Sundar Pichai Jai Shankar : డిజిటల్ పరివర్తనపై భారత్ ఫోకస్
జై శంకర్ తో గూగుల్ సిఇఓ పిచాయ్ భేటీ
Sundar Pichai Jai Shankar : డిజిటల్ పరివర్తనపై భారత్ ఫోకస్ పెడుతుందని స్పష్టం చేశారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ సిఇఓ సుందర్ పిచాయ్(Sundar Pichai) మంగళవారం కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఇద్దరూ చాలా సేపు వివిధ అంశాలపై చర్చించారు.
పిచాయ్ , కేంద్ర మంత్రి ప్రపంచ పరిణామాలు, డిజిటలైజేషన్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. గూగుల్ సిఇఓ నిన్న దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర్ దాస్ తో కలిశారు. ఇదిలా ఉండగా ఇవాళ మధ్యాహ్నం గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ ని కలవడం ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు జై శంకర్.
భారత దేశానికి సంబంధించి డిజిటల్ పరివర్తన, ప్రపంచ వ్యూహాత్మక అభివృద్ది గురించి చర్చించారని తెలిపారు. ఇదే విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
ప్రస్తుతం భారత దేశం జీ20 గ్రూప్ కు నాయకత్వం వహించడం సంతోషం కలిగించిందని, ఆ దిశగా గూగుల్ కూడా సపోర్ట్ చేసేందుకు సిద్దంగా ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు సుందర్ పిచాయ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) నాయకత్వంలో వేగవంతమైన సాంకేతిక మార్పులను చూడటం స్పూర్తి దాయకంగా ఉందని తెలిపారు.
అందరికీ పని చేసే అవకాశం. ఇంటర్నెట్ ను ముందుకు తీసుకు వెళ్లేందుకు బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు సంతోషంగా ఉందన్నారు గూగుల్ సిఇఓ.
ఇదిలా ఉండగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. తాను సుందర్ పిచాయ్ ను కలుసు కోవడం సంతోషం కలిగించిందన్నారు. మానవ శ్రేయస్సు, స్థిరమైన అభివృద్ది కోసం సాంకేతికతను ప్రభావితం చేసేందుకు ప్రపంచంతో కలిసి పని చేయడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.
Also Read : ఏ భాష లోనైనా సెర్చ్ చేయొచ్చు