Suneetha Narreddy: మా నాన్నను ఆ ముగ్గురే చంపినట్లు సంతకం చేయమన్నారు – వివేకా కుమార్తె సునీత
మా నాన్నను ఆ ముగ్గురే చంపినట్లు సంతకం చేయమన్నారు - వివేకా కుమార్తె సునీత
Suneetha Narreddy : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత దంపతులు కడప ఎస్పీ అశోక్‌కుమార్ ను కలిశారు. వివేకా హత్య కేసు తాజా పరిణామాలను ఎస్పీకి సునీత, రాజశేఖర్‌రెడ్డి వివరించారు. సుప్రీంకోర్టులో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ దృష్ట్యా ఎస్పీతో వారు సమావేశమయ్యారు. అనంతరం సునీత (Suneetha Narreddy) మీడియాతో మాట్లాడారు.
Suneetha Narreddy Key Comments
‘‘జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా రెండు రోజులుగా పులివెందులలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మా నాన్న వివేకా హత్య గుర్తొస్తోంది. గొడ్డలిపోటుతో వివేకా పడి ఉంటే అప్పుడు గుండెపోటు అని చెప్పారు. గతంలో టీడీపీ నేతలు చంపారని నమ్మబలికారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్‌ను తుడిచేశారు. హత్య తర్వాత ఓ లేఖ తెచ్చి మా నాన్నను ఆదినారాయణరెడ్డి, సతీశ్‌రెడ్డి, బీటెక్ రవి చంపినట్లు సంతకం చేయమంటే నేను చేయలేదు. అవినాష్‌రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారు.
ఇప్పుడు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ అదే జరుగుతోంది. మా బంధువు సురేశ్‌పై అవినాష్ అనుచరులు దాడి చేయించారనే అనుమానముంది. ఆరేళ్లుగా వివేకా హత్య కేసుపై పోరాడుతూనే ఉన్నా. ఇప్పటి వరకు దోషులకు శిక్ష పడలేదు. వివేకాను నేను, నా భర్త చంపించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి’’ అని సునీత అన్నారు.
Also Read : Komatireddy Rajgopal Reddy: కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నజర్ ?
